Share News

ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలి

ABN , Publish Date - Sep 05 , 2025 | 11:27 PM

గణేష్‌ నిమజ్జన ఉత్సవాల్లో ఎటు వంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావ రణంలో ప్రతి ఒక్కరూ నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం దండేపల్లి మండలం గూడెం గోదావరినది వద్ద నిమజ్జన చేసే ప్రదేశంను, ఏర్పాటులను పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలిం చారు.

 ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరగాలి
గూడెం గోదావరి నది వినాయక నిమర్జన స్ధలంను పరిశీలిస్తున్న డీసీపీ, సీఐ, ఎస్సైలు

మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

దండేపల్లి సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నిమజ్జన ఉత్సవాల్లో ఎటు వంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావ రణంలో ప్రతి ఒక్కరూ నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం దండేపల్లి మండలం గూడెం గోదావరినది వద్ద నిమజ్జన చేసే ప్రదేశంను, ఏర్పాటులను పోలీసు సిబ్బందితో కలిసి పరిశీలిం చారు. డీసీపీ మాట్లాడుతూ నిర్వాహకులు ఎవ రిని నదిలోకి వెళ్లకుండా భారీ క్రేన్‌ల సాయంతో విగ్రహాలను నిమజ్ఞనం చేసేలా తగ్గిన ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జర గకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీపీ వె ల్లడించారు. అనంతరం పోలీసు సిబ్బందితో గోదావరి తీరం వద్ద ఏర్పాటు తీ రుపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్ర త్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్‌ లక్షెట్టిపేట సీఐ రమణామూర్తి, దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్సైలు తహసినోద్ధీన్‌, సురేష్‌, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పోలీసులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 11:27 PM