Share News

తమ్ముడి దగ్గరికి వెళతా

ABN , Publish Date - Apr 24 , 2025 | 12:00 AM

తమ్ముడి మరణంతో కలతచెందిన అన్న ఆత్మహత్య చేసు కున్నాడు.

తమ్ముడి దగ్గరికి వెళతా

తమ్ముడి మృతితో కలత చెంది అన్న ఆత్మహత్య

భువనగిరి టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): తమ్ముడి మరణంతో కలతచెందిన అన్న ఆత్మహత్య చేసు కున్నాడు. ఈ ఘటన బుధవారం భువనగిరిలో జరిగింది. పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన పర్వతం సాయి మూడు నెలల క్రితం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమ్ముడి మరణంతో కలత చెందిన అన్న పర్వతం కిరణ్‌ (22) కొంతకాలంగా తమ్ముడు లేకుండా నేను ఉండలేక పోతున్నా.. నేను కూడా తమ్ముడి దగ్గరికి వెళతానని కుటుంబసభ్యులతో చెప్పేవాడు. అతను ఆత్మహత్య చేసుకుంటాడనే భయంతో కుటుంబ సభ్యులు అతడిని ఇంటి నుంచి బయటకి వెళ్లనివ్వడం లేదు. ఈ నెల 22న మంగళవారం రాత్రి ఇంటి నుంచి తప్పించుకొని భువనగిరి పట్టణ శివారులోని నల్లగొండ రోడ్డులోని ఈపీసీ పరిశ్రమ వెంట గల మారుతీ నగర్‌ సంజనా వెంచర్‌కు అర్థరాత్రి వచ్చి తన సోదరికి అర్థరాత్రి 12.40 గంటలకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెతకగా సంఘటనా స్థలంలో విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 24 , 2025 | 12:00 AM