kumaram bheem asifabad-సన్నబియ్యం అక్రమ రవాణా
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:16 PM
రేషన్ దుకాణాల్లో సరఫరా చేస్తున్న సన్నబియ్యం అక్రమ రావాణా చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కుమరం భీ జిల్లాలోని ప్రధానంగా రైసు మిల్లులు అధికంగా ఉన్నటువంటి కాగజ్‌నగర్‌లో మిల్లర్లు సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యాన్ని తరలించగా ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశ పెట్టి ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. అయితే రైసు మిల్లర్లు, రేషన్ డీలర్లు, బియ్యం స్మగ్లర్లు ఒక్కటయి దందా వదలకుండా కొనసాగిస్తున్నారు.
- నిఘా పెంచితేనే అడ్డుకట్ట
కాగజ్‌నగర్ టౌన్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రేషన్ దుకాణాల్లో సరఫరా చేస్తున్న సన్నబియ్యం అక్రమ రావాణా చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. కుమరం భీ జిల్లాలోని ప్రధానంగా రైసు మిల్లులు అధికంగా ఉన్నటువంటి కాగజ్‌నగర్‌లో మిల్లర్లు సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యాన్ని తరలించగా ప్రభుత్వం సన్నబియ్యం ప్రవేశ పెట్టి ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. అయితే రైసు మిల్లర్లు, రేషన్ డీలర్లు, బియ్యం స్మగ్లర్లు ఒక్కటయి దందా వదలకుండా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఆహార భద్రత కార్డుల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుండగా కిలోకి రూ. 18 నుంచి 20కు కొనుగోలు చేసి డీలర్ల వద్ద నుంచి భారీ ఎత్తున దళారులు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు లేదా కొన్ని రైసు మిల్లులకు తరలిస్తున్నారు. ఇటీవల దహెగాం మండలంలోని ఓ రైసు మిల్లులో సన్నబియ్యాన్ని డిటి ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు స్వాఽధీనం చేసుకోగా, సిర్పూర్(టి) మండలంలోని ఓ రైసు మిల్లులోనూ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచగా పట్టుబడ్డ విషయం మచ్చుకు మాత్రమేననే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 30కి పైగా రైస్ మిల్లులుంటే కేవలం ఆసిఫాబాద్ డివిజన్‌లో ఒకటి, రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ కాగజ్‌నగర్ డివిజలోనే అధికంగా ఉన్నాయి. కౌటాల, సిర్పూర్(టి), బెజ్జూరు, పెంచికల పేట, దహెగాంతో పాటు ఆయా మండలాల్లో పలుసార్లు మిల్లర్ల మాయాజాలంతో అక్రమంగా దాచిన నిల్వలు దొరికాయి. ఈ బియ్యాన్ని అనుకూ లంగా ఉన్నప్పుడు సరిహద్దులు దాటిసున్నారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు కాగజ్‌నగర్ డివిజన్ కేంద్రంగా మారింది. బియ్యం పట్టుబడ్డప్పుడు కేసులు నమోదు చేయాల్సిన కొంత మంది అధికారులు కేసుల తీవ్రత తగ్గించడంతో దందాకు అడ్డుకట్టపడడం లేదనే విమర్శలున్నాయి. ప్రతీ నెల 10వేల మందికి పైగా లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోవడంతో ఈ బియ్యం కార్డులు అసలువా? నకిలీవా తేల్చాల్సి ఉంది.
- డీలర్లే సూత్రధారులు..
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్ దుకాణాలుండగా కొంత మంది డీలర్ల వద్ద నుంచి సన్నబియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రతి నెల షాపులకు వచ్చే లబ్దిదారులకు బియ్యం కావాలా డబ్బులు కావాలా అని అడిగే మరీ వేలి ముద్రలు వేసుకొని బియాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన వ్యాపారులు పక్కనే ఉన్న మహారాష్ట్రతో పాటు ఇతర పనులు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అయితే ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు, సిబ్బంది అడపాదడపా దాడులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు చేసిన దాఖలాలు ఉన్నప్పటికీ జిల్లాలోని కొంత మంది అధికారుల మెతక వైఖరి అనుమానాలకు తావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 314పైగా రేషన్ దుకాణాలుండగా, 1,41,904 రేషన్ కారులు, 4.48 లక్షల లబ్దిదారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుండడంతో కాస్త వినియోగం పెరిగినా వినియోగించేందుకు ఇష్టపడని లబ్ధిదారులు బియ్యాన్ని విక్రయిస్తు న్నారు. దీంతో సన్న బియ్యాన్ని కూడా వదలకుండా రైస్ మిల్లర్లు, దళారులు, రేషన్ డీలర్లు కుమ్ముక్కై సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు నిఘా తీవ్ర తరం చేస్తేనే సన్నబియ్యం అక్రమ రవాణాకు అడ్టుకట్ట పడే అవకాశం ఉంది.