Illegal Immigrants: మంది అక్రమ విదేశీయులు డిపోర్ట్
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:51 AM
హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న పలువురు విదేశీయులను సైబరాబాద్ పోలీసులు సాగనంపారు. ఇటీవల ఓ ఫాంహౌ్‌సలో డీజే మోతతో పుట్టిన రోజు...
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న పలువురు విదేశీయులను సైబరాబాద్ పోలీసులు సాగనంపారు. ఇటీవల ఓ ఫాంహౌ్‌సలో డీజే మోతతో పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో రాజేంద్రనగర్ జోన్ పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో అక్కడ విదేశీయులైన 14 మంది పురుషులు, 37 మంది మహిళలను గుర్తించారు. వారిలో 36 మంది నగరంలో అక్రమంగా ఉంటున్నట్లు విచారణలో తేలింది. అందులో ఏడుగురు పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు. వారంతా ఉగాండా, నైజీరియా, లైబీరియా, బోట్స్వానా, కెన్యా, కామెరూన్, మొజాంబిక్, జింబాబ్వే, ఘనా, మలావి దేశాలకు చెందిన వారని తెలిసింది. ఈ 36 మందిలో 21 మంది వద్ద సరైన పాస్‌పోర్టులు ఉండటంతో వారిని స్వదేశాలకు పంపించారు. ఢిల్లీలోని సంబంధిత విదేశీ రాయబార కార్యాలయాల నుంచి మరో ముగ్గురికి వన్ టైమ్ ట్రావెల్ డాక్యుమెంట్లు ఇప్పించి సాగనంపారు. 12 మంది వద్ద ఎటువంటి పత్రాలు లేవు. దీంతో వారిని పంపించేందుకు సంబంధిత దేశాల రాయబార కార్యాలయాలకు అధికారులు లేఖలు రాశారు.