Share News

Internship Opportunities: పరిశోధనల అభివృద్ధి కోసం..ఐఐటీహెచ్‌తో ఆటా ఒప్పందం

ABN , Publish Date - Oct 01 , 2025 | 03:22 AM

ఆధునిక పరిశోధనల అభివృద్ధి కోసం ఆటా(ఆల్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌)తో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ ఒప్పందం...

Internship Opportunities: పరిశోధనల అభివృద్ధి కోసం..ఐఐటీహెచ్‌తో ఆటా ఒప్పందం

కంది, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆధునిక పరిశోధనల అభివృద్ధి కోసం ఆటా(ఆల్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌)తో సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ ఒప్పందం చేసుకుంది. వాషింగ్టన్‌ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్‌ చల్లా, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బి.ఎస్‌. మూర్తిలు ఈ మేరకు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో అమెరికాలోని తెలుగు విద్యార్థులకు గ్లోబల్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు లభిస్తాయి. ఇంజనీరింగ్‌లో దేశంలోనే 75వ ర్యాంక్‌, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్‌ సాధించిన ఐఐటీ హైదరాబాద్‌తో ఈ కీలక ఒప్పందం చేసుకోవడం తమకు గర్వకారణమని జయంత్‌ చల్లా పేర్కొన్నారు. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు ఉంటుందని, అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ఐఐటీహెచ్‌ క్యాంప్‌సలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఆవిష్కరణల్లో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయన్నారు. ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తలు సాంకేతికతను ఉపయోగించి పరిశోధనలు జరపనున్నట్లు ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 03:22 AM