నిర్లక్ష్యం చేస్తే విధుల నుంచి తొలగిస్తాం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:29 PM
గతంలో వీఆర్వో వ్యవస్థలో చేసిన తప్పిదాలు ఇక్కడ చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉందని, జేపీవో తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆ యన ఆకస్మికంగా సందర్శించారు.
జేపీవోలను ఉద్దేశించి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య
దండేపల్లి సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): గతంలో వీఆర్వో వ్యవస్థలో చేసిన తప్పిదాలు ఇక్కడ చేస్తే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉందని, జేపీవో తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆ యన ఆకస్మికంగా సందర్శించారు. నూతనంగా నియమితులైన జేపివోలతో స మీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా రెవెన్యూ ఫైల్స్, రికార్డులను ప రిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భూ భారతి పకడ్బందీగా అమలు చేసి, ఈ చట్టంపై పూర్తిగా అవగాహన పెంచుకోవా ల న్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. భూభారతి చట్టంపై మరింత అవగాహన పెంచుకోని ప్రజలకు మెరుగైన సేవలు అం దించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ చుంచు మాథవి, ఆర్‌ఐ బొద్దుల భూమన్న, రెవెన్యూ సిబ్బంది, జేపివోలు పాల్గొన్నారు.
జన్నారం: భూభారతిలోని సమస్యలను వెనువెంట పరిష్కరించాలని అడి షనల్ కలెక్టర్(రెవెన్యూ) చంద్రయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. భూభారతిలో పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలని రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, డిప్య్డూటీ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్‌ఐలు భానుచం దర్ ఉన్నారు.
జిల్లాలో మోస్తరు వర్షపాతం నమోదు
మంచిర్యాల, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లాలో శుక్రవా రం 15.9 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చెన్నూర్‌లో 57.6 మిల్లీ మీటర్లు, కోటపల్లి మండలంలో 50.0, హాజీపూర్‌లో 22.4, లక్షెట్టిపేటలో 22.2, మంచిర్యాలలో 18.8, జన్నారంలో 11.4 మిల్లీమీటర్లు, కన్నెపల్లిలో 9.4, దండేపల్లిలో 8.2 మందమర్రిలో 7.8 మిల్లీ మీటర్ల, వర్షపాతం నమోదైంది.
మందమర్రిటౌన్ : మందమర్రి మండల వ్యాప్తంగా శుక్రవారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కెట్ సెంటర్‌లోని వరదనీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది. 6గంటల నుంచి ఎడతెరపిలేకుండా వ్యాపార దుకాణ దారులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక కోల్‌బెల్ట్‌పై వరదనీరు ప్రవ హించింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కూరగాయల మార్కెట్‌లో పెద్దఎత్తున నీరు నిలిచింది.