kumaram bheem asifabad- మోతాదు మించితే ముప్పే
ABN , Publish Date - Aug 23 , 2025 | 10:54 PM
వ్యవసాయ పంటలపై మోతాదుకు మించి ఎరువులు వాడొద్దని, విచ్చలవిడిగా కుమ్మరిస్తే భూ మి నిస్సారమవుతుదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అధికారుల సూచన మేరకు మి తంగా వాడాలని సూచిస్తున్నారు.
- విషతుల్యమవుతున్న ఆహార పదార్థాలు
- అప్రమత్తత అవసరమంటున్న వ్యవసాయ అధికారులు
వ్యవసాయ పంటలపై మోతాదుకు మించి ఎరువులు వాడొద్దని, విచ్చలవిడిగా కుమ్మరిస్తే భూ మి నిస్సారమవుతుదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అధికారుల సూచన మేరకు మి తంగా వాడాలని సూచిస్తున్నారు.
వాంకిడి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పంటల సాగులో మోతాదుకు మించిన ఎరువులు, పురు గుల మందులు వినియోగిచవద్దని వ్యవసాయాధి కారులు సూచిస్తున్నా రైతులు పాటించడం లేదు. జిల్లాలో అన్నదాతలు తెల్లబంగారాన్ని అధిక విస్తిర్ణంలో సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్లంగా పత్తి 3,29,184 ఎకరాల్లో, కంది 27,178 ఎకరాల్లో, సోయా 2872 ఎకరాల్లో, మొక్కజొన్న 4610 ఎకరాల్లో, పెసర 617 ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొంత మేర దెబ్బతీశాయి. ఈ కారణంగా పలు ప్రాం తాల్లో పత్తి మొక్కల ఎదుగుదల తగ్గిపోయింది. చీడపీ డల బెడద కూడా అధికంగా ఆశించే ప్రమాద ముంది. దీందో రైతులు ఇప్పటి నుండే రసాయన ఎరువుల వాడకంపై దృష్టి పెడుతున్నారు. పంటల సాగులో మోతాదుకు మించిన ఎరువులు, పురుగుల మందులు వినియోగించ వద్దని వ్యవసాయ అధికారులు తరచు రైతులకు సూచనలు అం దిస్తున్నా మందుల పిచికారీలో జాగ్రత్తలు పాటించడంలేదు. అధిక మోతాదుల్లో రసాయన ఎరువు లు, పురుగుల మందులు విచక్షణారహితంగా వినియోగిస్తున్నందున రైతులు ఏటా పంటల దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రసాయనాల ఎరువులు వాడకంవల్ల వేల రూపాయలు వృధా తప్ప ఎలాంటి లాభం లేదన్న విషయాన్ని రైతులు తెలుసుకోవడంలేదు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారిస్తే తక్కువ పెట్టుబడితో అఽధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సీజన్‌కు అనుగుణంగా రైతులు వివిధ రకాల పంట సాగు చేస్తారు. అయా పంటలను ఆశించే తెగుళ్ళను నివారించెందుకు రైతులు విచ్చలవిడిగా ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తున్నారు. దీంతో రైతులపై అదనపు బారం పడుతుంది. మార్కెట్లో వస్తున్న కొత్త రకం ఎరువులు, పురుగుల మందులను తక్కువ ధరలకు అందిస్తుండడంతో రైతులు తీవ్రంగా మోసపోతున్నారు. వివిద రకాల కంపెనీల డీలర్లు రైతుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని ఎరువులు, పురుగు మం దులను అంటగుడుతున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోకుండా మందులను వాడుతుండడంతో పురుగుల నివార నేమో గాని ఉన్న పంటలను కోల్పోవల్సిన దుస్థితి ఎదురవుతుంది.
- భూసార పరీక్షలపై నిర్లక్ష్యం..
పంటసాగుచేసే సమయంలోనే రైతులు తప్పటడుగులు వేస్తున్నారు. భూసార పరీక్షలు చేయించకుండానే పంటలు వేస్తున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పట్టించుకోవడంలేదు. ఆపై వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడికూడా చేతికి రావడంలేదు. అలా కాకుండా వ్యవసాయ అధికారుల సూచనల మెరకు భూసార పరీక్షలు చేయిం చి ఆపై ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగిస్తే మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
- అవగాహన లేక..
చాలా మంది రైతులకు పురుగు మందుల వాడకంపై అవగాహన లేక ఎరువుల డీలర్లు, వ్యాపారులు సూచిస్తున్న మందులనే పిచికారీ చేస్తున్నారు. ఒక్కో కంపెనీ తయారు చేసే మందు ప్రభావం ఒక్కోరకంగా ఉంటుంది. పిచికారీ చేసే వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏ పురుగుకు ఏ మందు వాడాలో తెలియని పరిస్థితి ఉంది. పంటలపై పిచికారీ చేసేటప్పడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియడం లేదు. కొన్ని రసాయన మందులు ఘాటైన వాసన కలిగి ఉంటే కొన్ని తేలికగా ఉంటాయి. రైతులు ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులను పిచికారీ చేసి ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. పిచకారీ చేసిన మందు శరీంలోకి వెళ్తే నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థ దెబ్బతిని వాంతులు, తలనొప్పులు వచ్చి అపస్మారక స్థితికి చేరుకొని ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మందులు పిచికారీ చేసే సమయంలో ముక్కుకు, నోటికి మాస్కులు ధరించాలి, చేతికి గ్లౌజులు వేసుకోవాలి, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కొన్న తరువాత భోజనం చేయాలి, వ్యవసాయ అధికారులు సూచనాలను పాటించాలి.
- భూసారం పెరగడంతో పాటు..
సేంద్రియ ఎరువుల వినియోగంతో భూసారం పెరగడంతో పాటు దీర్ఘకాలంగా తక్కు వ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. రసాయన ఎరువు ల, పురుగుల మందుల వాడకంతో ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంతో పర్యావరణానికి మేలు చేకూరి పెట్టుబడి భారం తగ్గుతుంది. పురుగుల మందులు కొనుగోలు చేసేటప్ప డు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలను పాటించాలి.
అధికారుల సూచనలు పాటించాలి..
- గోపికాంత్, వ్యవసాయ అధికారి
పంటలపై పురుగుల మందులు వేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ అధికారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంలో ముందుస్తు సలహాలు తీసుకోవాలి. రైతులు ఇష్టాను సారంగా ఎరువులు, పురుగు మందుల వాడితే పంట దెబ్బతిని దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంటసాగుకు ముందు భూసార పరీక్షలు చేపించుకుంటే మేలు. పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే రైతులకు పంట దిగుబ డులు పెరిగే అవకాశం ఉంటుంది.