సంస్కారంతో మెదిలితే ఏదైన సాఽధించవచ్చు
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:38 PM
బడులు పాఠాలు నేర్పుతాయి, సమాజం పట్ల సంస్కా రంతో మెదిలితే జీవితంలో ఏదైన సాధించ వ చ్చునని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మం గళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడి పేటలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యా లయ నూతన భవనాన్ని ఎస్సీ ఏడీ దుర్గ ప్ర సాద్, జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్, 13వ బెటాలియన్ అదనపు కమాండెంట్‌లతో కలిసి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు.
కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కలెక్టర్ కుమార్‌దీపక్
హాజీపూర్, జూలై29 (ఆంధ్రజ్యోతి): బడులు పాఠాలు నేర్పుతాయి, సమాజం పట్ల సంస్కా రంతో మెదిలితే జీవితంలో ఏదైన సాధించ వ చ్చునని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మం గళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడి పేటలో నూతనంగా నిర్మించిన కేంద్రీయ విద్యా లయ నూతన భవనాన్ని ఎస్సీ ఏడీ దుర్గ ప్ర సాద్, జిల్లా సంక్షేమాధికారి రవూఫ్‌ఖాన్, 13వ బెటాలియన్ అదనపు కమాండెంట్‌లతో కలిసి కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాలు, నవోద య పాఠశాలల ద్వారా జ్ఞానం, క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తామన్నారు. ఏ పాఠశాల లో అయినా ఒక ప్రాంతం నుంచి వచ్చిన విద్యా ర్థులు మాత్రమే చదువుకుంటారని, కాని కేంద్రీ య విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో వి విధ ప్రాంతాలు, బాషలు, భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే వేదికగా విద్యను అభ్యసిస్తారని తెలిపారు. ఏకాగ్రతతో కష్టపడే వారు విజయాలు సాధిస్తారని జీవితంలో ఎదు ర్కొనే హెచ్చుతగ్గులను అధిగమించి ఉన్నత స్థా నాలకు ఎదుగుతారని తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, కళలు, ఇతర ఆసక్తి ఉన్న రంగాల్లో రా ణించాలని సమాజంపై అవగాహన పెంచుకో వాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేవీ పాఠశాలల ఆర్‌ఓలు చంద్ర మౌళి, పవన్ కుమార్, ఎంజేపీ ఆర్ సీవో శ్రీధర్, తహసీల్దార్ శ్రీనివాస్ రావుదేశ్ పాండే, కేంద్రీ య విద్యాలయ ప్రిన్సిపాల్ దిలీప్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.