kumaram bheem asifabad- వరికొయ్యలు కాల్చితే ముప్పే
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:22 PM
జిల్లాలో యాసంగి సీజన్ పనులు ప్రారంభమవుతు న్న వేళ రైతన్నలు వానాకాలంలో కోసిన వరి పంట పొలాల్లో కొయ్యలను కాల్చి వేస్తున్నారు. వచ్చే సీజన్ కోసం నేలను సిద్దం చేస్తున్నారు అన్నదాతలు. వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు.
- పర్యావరణానికి హానీ
ఆసిఫాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సీజన్ పనులు ప్రారంభమవుతు న్న వేళ రైతన్నలు వానాకాలంలో కోసిన వరి పంట పొలాల్లో కొయ్యలను కాల్చి వేస్తున్నారు. వచ్చే సీజన్ కోసం నేలను సిద్దం చేస్తున్నారు అన్నదాతలు. వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. జిల్లాలో వరి సాగు చేసే మండలాలలో ఎక్కడ చూసినా పంట పొలాల్లో మాడిన మసి కొయ్యలే కనిపిస్తున్నాయి. కొయ్యలను కాల్చడం ద్వారా వెలువడే పొగతో వాతవరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బతింటుంది. .పంటలకు అవసరమైన సూక్ష్మపోషకాలు నశిస్తాయి. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో వరి పంట 56,861 ఎకరాలలో సాగు చేశారు. కొతలు కూడా పూర్తయ్యాయి. పంట కొనుగొళ్ల ప్రక్రియ కొనసాగుతు న్నది. పొలాల్లో మిగిలిన వరి కొయ్యలను దున్నాలంటే సమయం పడుతుం దని, ఖర్చు అవుతుందని చాలా మంది తగలబెడుతున్నారు. ఒక్కసారి అగ్గి రాజేస్తె చాలు గంటలో కాలిపోతుందని భావిస్తున్నారు. దీని వల్ల అధికంగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ వరి కొయ్యలను తగలబెట్టోదని రైతులకు వ్యవసాయధి కారులు సూచిస్తున్నారు.
- ప్రయోజనం ఉండదని చెబుతున్నా..
వరి కొయ్యలను కాల్చితే నష్టమే తప్ప ఎలాంటి ప్ర యోజనం ఉండదని వ్యవసాయాధికారులు చెబుతు న్నారు. కాల్చడం ద్వారా విపరితమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, ఫాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గుతుంది. పంట లకు ఉపయోగపడే సూక్ష్మజీవులు, రైతు మిత్ర పురు గులు, ఖనిజ లవణాలు నశిస్తాయి. దీంతో పంట దిగుబడి పై తీవ్ర ప్రభావం పడుతుంది. భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలి పోతాయి. శ్వాస కోస సమస్యలు తలెత్తుతాయి. పర్యా వరణ సమతుల్యం దెబ్బతింటుంది.
- కలియ దున్నడంతో లాభాలు..
వరి కొయ్యలు నేలలో కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది. పొలం దున్నే పది రోజులు ముందు గడ్డిని పొలంలో పరిచి నీరు అందించాలి. తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ ఫాస్ఫెట్ చల్లాలి. దీంతో భూమి దెబ్బ తినడం నుంచి తప్పించడమే కాకుండా భూమిలో సేంద్రియ పదా ర్థాల స్థాయిని పెంచవచ్చు. ఈ పద్ధతి పాటించడం వల్ల నీటి నిల్వ చూసుకునే సామర్య్థం పెరిగి దిగు బడి అవకాశాలు మెరుగు పడుతాయి.