Share News

గంజాయిలో పట్టుబడితే జైలుకే

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:14 PM

గంజాయి, డగ్స్‌ కేసులో ఒక్క సారి దొరికినా జీవితం నాశనం చేసుకున్న వాళ్లు అవుతారని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ప్రజలు రద్దీగా ఉండే ప్రాం తాల్లో సోమవారం నార్కొటిక్‌ డాగ్‌(గంజాయి,డ్రగ్స్‌ను పసిగట్టే శునకం)తో బస్టాండ్‌, ఊత్కూర్‌ చౌరస్తాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

గంజాయిలో పట్టుబడితే జైలుకే

లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి

లక్షెట్టిపేట, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): గంజాయి, డగ్స్‌ కేసులో ఒక్క సారి దొరికినా జీవితం నాశనం చేసుకున్న వాళ్లు అవుతారని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ప్రజలు రద్దీగా ఉండే ప్రాం తాల్లో సోమవారం నార్కొటిక్‌ డాగ్‌(గంజాయి,డ్రగ్స్‌ను పసిగట్టే శునకం)తో బస్టాండ్‌, ఊత్కూర్‌ చౌరస్తాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసం దర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి సేవించినా, విక్రయించినా చాలా పెద్ద నేరం అన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా మన తెలంగాణను అగ్ర గామిలో ఉంచాలని ప్రభుత్వంతో పాటు పోలీస్‌ శాఖ అహర్నిషలు కృషి చేస్తుందన్నారు. మన ప్రాంతంలో ఎవరైనా గంజాయి డ్రగ్స్‌కి అలవాటు ప డ్డ, వాటిని విక్రయించిన తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స మాచారం ఇచ్చిన వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్‌కి యువత, విద్యార్థులు అలవాటు పడుతున్నారని తల్లితం డ్రులు తమతమ పిల్లలపై వాళ్ల నడవడికపై కన్నేసి ఉంచాలన్నారు. సీఐ వెంట లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:14 PM