Share News

ఉద్యమాలను అణిచివేస్తే తిరుగుబాటు తప్పదు

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:00 AM

ప్రజా సమస్యలపై పోరాడేది కేవలం కమ్యూనిస్టులేనని ఆపరేషన్‌ కగార్‌ పేరిట ఉద్యమాలను ప్రశ్నించే గొంతుకలను మావోయిస్టులను హతమారిస్తే తీవ్ర పరిణామాలు మోదీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రా ద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు పేర్కొన్నారు. శ

 ఉద్యమాలను అణిచివేస్తే తిరుగుబాటు తప్పదు
మాట్లాడుతున్న కూనంనేని సాంభశివరావు

-మతాలు కులాల పేరిట చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ

-సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలపై పోరాడేది కేవలం కమ్యూనిస్టులేనని ఆపరేషన్‌ కగార్‌ పేరిట ఉద్యమాలను ప్రశ్నించే గొంతుకలను మావోయిస్టులను హతమారిస్తే తీవ్ర పరిణామాలు మోదీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రా ద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు పేర్కొన్నారు. శని వారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిం చిన సీపీఐ రెండు రోజుల నాలుగో మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి బాలుర ఉన్నత పాఠశాల వరకు ప్రజానాట్య మండలి కళాకారులు నర్సింహులు నే తృత్వంలో డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో దారి పొడవునా అరుణ పతాకాలతో సందడి చేశారు. సీపీఐకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా సభలో సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో సమస్యలను ప రిష్కరించే తెగువ, ధైర్యం కేవలం సీపీఐ పార్టీకే ఉంటుందన్నారు. నిరంకు శత్వం, భూస్వాయ్య పోరాటాలకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరా టాలు నిర్వహించింది కమ్యూనిస్టు పార్టీలేనన్నారు. దేశంలో మోదీ ప్రభు త్వం కులాలు, మతాల పేరిట చిచ్చు పెడుతూ హింస రాజకీయాలకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. ఒక వైపు కార్పోరేట్‌ శక్తులు కొమ్ముకాస్తూ మ రో వైపు కమ్యూనిస్టు పార్టీలను అణిచి వేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయ త్నిస్తుందని, ఇది నెరవేరదన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది సీపీఐ పార్టీ అని, ప్రజలంద రు ఐక్యంగా ఉండాలన్నారు.

అంతకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆపరేషన్‌ కగార్‌ పేరిట కేంద్ర ప్రభుత్వం మారణహోమం సృష్టి స్తోందన్నారు. దేశం, రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షోభ పరి స్థితులు ఏర్పడ్డాయన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలు స్తుందన్నారు. బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే ఆపి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ర్టాల్లో చర్చలు సమన్వయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, జిల్లా నాయకులు మేకల దాసు, రామడుగు లక్ష్మణ్‌, కలీందర్‌ఆలీఖాన్‌, వాసిరెడ్డి సీతారామయ్య, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ఫఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్‌ జర్నలిస్టు ఎండీమునీర్‌ కుటుంబాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంచిర్యాలలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబీకులను పరామర్శించారు. ఎలాంటి ఆం దోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామన్నారు. నాయకులు సంధాని, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 12:00 AM