చినుకు పడితే కరెంట్ కట్
ABN , Publish Date - Jul 01 , 2025 | 12:57 AM
వర్షాకాలం వచ్చిదంటే చాలు ఉమ్మడి మండలంలో కరెంట్ కష్టాలు మొదలవుతాయి. చిన్న గాలివాన వచ్చిదంటే విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వసాధారణంగా మారింది.
చినుకు పడితే కరెంట్ కట్
132 కేవీ సబ్‌స్టేషన లేక కొండమల్లేపల్లి నుంచి సరఫరా
అయినా తరచూ కరెంట్ సమస్యలు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వ్యాపారులు
పట్టించుకుని విద్యుతశాఖ, బిల్లులు మాత్రం నెలనెలా వసూలు
వర్షాకాలం వచ్చిదంటే చాలు ఉమ్మడి మండలంలో కరెంట్ కష్టాలు మొదలవుతాయి. చిన్న గాలివాన వచ్చిదంటే విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడటం సర్వసాధారణంగా మారింది. ఉమ్మడిమండలంలో 37 గ్రామపంచాయతీలు వాటికి అనుబంధగ్రామాలు ఉన్నా యి. కాగావిద్యుత సరఫరా కోసం ఉమ్మడి మండలంలో ఆరు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంగడిపేట ఎక్స్‌రోడ్డు, గుడిపల్లి, ఘనపురం, అజ్మపురం, పుట్టంగండి, దుగ్యాలలో ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉమ్మడి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత సరఫరా చేస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి,పెద్దఅడిశర్లపల్లి)
మండలంలోని అంగడిసేట ఎక్స్‌రోడ్డు వద్ద దేవరకొండ డివిజనలోనే మూడు పవర్ ట్రాన్సఫార్మర్లు (పీటీఆర్) రెండు 8 ఎంవీఏ, ఒక 8 ఎంవీఏ ఉన్న అతిపెద్ద సబ్‌స్టేషనను 25 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. మండలానికి 132 కేవీ సబ్‌స్టేషన లేకపోవడంతో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండమల్లేపల్లి నుంచి విద్యుత సరఫరా అవుతుంది. దీంతో ఆ మండలంలో కరెంట్ సమస్యలు వచ్చినా కరెంట్ సరఫరా నిలిచిపోతుంది. మండలానికి వచ్చే విద్యుత లైన్ల కింద హారితహారం చెట్లు పెట్టడంతో అవి పెద్దగా పెరగడంతో విద్యుత సరఫరా నిలిచిపోయిన సమయంలో సమస్యను గుర్తించడం సిబ్బందికి కష్టంగా మారుతుంది. దీంతో గంటల పాటు విద్యుత సరఫరా అంతరాయం కలుగుతుంది. ఒక్కోసారి రాత్రంతా విద్యుత ఉండకపోవడంతో ప్రజలు జాగారం చేయాల్సి దుస్థితి నెలకొంటుంది. గంటల తరబడి విద్యుత సరఫరా నిలిచిపోవడం ద్వారా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సెల్‌ఫోన టవర్లకు విద్యుత సరఫరా నిలిచిపోవడంతో సెల్‌ఫోన్లు మూగపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం 133 కేవీ విద్యుత లైన్లకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం, నాణ్యమైన ఇన్సులెటర్లు లేకపోవడమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వ్యాపారం దెబ్బతింటుంది
మండలంలో చిన్నపాటి వర్షం పడినా గంటల తరబ డివిద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుంది. తరచూ అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు అధికారులు విద్యుత లైన్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలి.
- మల్లిఖార్జున, జీరాక్స్ సెంటర్ నిర్వాహకుడు
మరమ్మతులు చేపడుతాం
మండలంలో విద్యుత లైన్లు ఎక్కువ శాతం హరితహారం మొక్కల పైన ఉండటంతో వర్షాలు కురిసిన సమయంలో విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈదురుగాలులు వచ్చిన ప్రతీసారి విద్యుత లైన్ల మరమ్మతులు చేపడుతున్నాం. ఇన్సులేటర్లు చెడిపోయిన చోట కొత్త వాటిని ఏర్పాటు చేశాం. విద్యుత సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- వసంత, ఇనచార్జి ఏఈ