బకాయిలు చెల్లించకుంటే పరీక్షలు నిర్వహించలేం
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:33 AM
పెండింగ్‌లో ఉన్న ఆర్‌టీఎఫ్- ఎంటీఎఫ్ నిధులు విడుదల చేసే వరకు మహాత్మాగాంధీ మూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల్లో జరగనున్న డిగ్రీ పరీక్షలు నిర్వహించలేమని డిగ్రీ కళాశాల యాజమాన్యాలు స్పష్టం చేశాయి.

మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎదుట డిగ్రీ కళాశాల యాజమాన్యాల నిరసన
వీసీకి వినతిప త్రం అందజేత
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఆర్‌టీఎఫ్- ఎంటీఎఫ్ నిధులు విడుదల చేసే వరకు మహాత్మాగాంధీ మూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల్లో జరగనున్న డిగ్రీ పరీక్షలు నిర్వహించలేమని డిగ్రీ కళాశాల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. తెలంగాణ డిగ్రీ, పీజీ మేనేజ్‌మెంట్ అసోసియేషప్ ఆధ్వర్యంలో నాయకులు ఎంజీ యూనివర్సిటీ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. వీసీ, రిజిస్ర్టార్, ఎగ్జామ్స్ కంట్రోలర్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మారం నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ఫీజుల ద్వారా మాత్రమే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తారన్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం ఆర్‌టీఎఫ్(రీయింబర్స్ మెంట్ ట్యూషన్ ఫీజు), ఎంటీఎఫ్(విద్యార్థులకు చెల్లించే ఫీజు) చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ అంశాలపై తొమ్మిది నెలలుగా నెలలుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదన్నారు. ఇటీవల రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మాత్రమే కొంతమేరకు నిధులు విడుదల చేసినా ఎంజీయూ పరిధిలోని ఉమ్మడి జిల్లాకు చెందిన కళాశాలలకు ఫీజులు చెల్లించడంలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు ఆరు నెలలుగా వేతనాలు, కళా శాలల భవన యజమానులకు అద్దెలు చెల్లించడం భారంగా మారిందన్నారు. కళాశాలల సిబ్బంది సహాయ నిరాకరణ, భవన యాజమాన్యాల వేధింపుల కారణంగా త్వరలో జరిగే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించే స్థితిలో లేమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మైలరిశెట్టి. సైదారావు, కోశాధికారి దరిపల్లి ప్రవీణ్, బి. శంకరయ్య, ఏ. సత్యంగౌడ్, ఎం. వెంకట్‌రెడ్డి, శంకర్, రాజశేఖర్‌రెడ్డి, హనుమంతు, సూర్యనారాయణ, ఆదిత్య సామ్రాట్, ఎం. సుబా్‌షరెడ్డి, పి. భాస్కర్‌రావు, కె. రాంమోహన్, టి. శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.