Share News

IBomma Ravi: ఐబొమ్మ రవి ఎవరో నాకు తెలియదు

ABN , Publish Date - Dec 29 , 2025 | 02:00 AM

సినిమా పైరసీ, కాపీరైట్‌ ఉల్లంఘన, మనీ లాండరింగ్‌ కేసుల్లో అరెస్టయిన ఐ బొమ్మ రవికి సంబంఽఽధించిన మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టినట్లు తెలిసింది..

IBomma Ravi: ఐబొమ్మ రవి ఎవరో నాకు తెలియదు

  • పోలీసుల విచారణలో వెల్లడించిన ప్రహ్లాద్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): సినిమా పైరసీ, కాపీరైట్‌ ఉల్లంఘన, మనీ లాండరింగ్‌ కేసుల్లో అరెస్టయిన ఐ బొమ్మ రవికి సంబంఽఽధించిన మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టినట్లు తెలిసింది. ప్రహ్లాద్‌ పేరుతో రవి డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ ప్రహ్లాద్‌ను పిలిచి విచారించారు. రవిని, ప్రహ్లాద్‌ను ముఖాముఖి విచారిర చగా, అసలు రవితో తనకు పరిచయమే లేదని ప్రహ్లాద్‌ స్పష్టంచేసినట్లు తెలిసింది. ప్రహ్లాద్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించి, ఆదివారం హైదరాబాద్‌కు పిలిచి విచారించగా ఈ విషయం బయటపడింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డులోని వివరాలను ప్రహ్లాద్‌కు చూపించగా, ఆ వివరాలు తనవేనని.. కానీ వాటిని రవి ఎలా తీసుకున్నాడో తెలియదని స్పష్ట చేశాడు. దీంతో ఇద్దరికీ పరిచయం లేదని పోలీసులు నిర్ధారించినట్లు తెలిసింది. ప్రహ్లాద్‌ వివరాలను రవి ఎక్కడి నుంచి సంపాదించాడు..? ఎలా సంపాదించాడు..? అనేది తేలాల్సి ఉంది.

Updated Date - Dec 29 , 2025 | 02:00 AM