Share News

iBomma Ravi: ఐ బొమ్మ రవి.. మరోసారి పోలీసు కస్టడీకి

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:56 AM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రవిపై ఐటీ చట్టం, కాపీరైట్‌ చట్టంతో ....

iBomma Ravi: ఐ బొమ్మ రవి.. మరోసారి పోలీసు కస్టడీకి

  • 12 రోజులు అనుమతించిన న్యాయస్థానం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రవిపై ఐటీ చట్టం, కాపీరైట్‌ చట్టంతో పాటు మనీ లాండరింగ్‌, విదేశీయుల చట్టం సహా.. మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే రెండుసార్లు అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం 8 రోజులు విచారించారు. మరో మూడు కేసుల్లోనూ విచారించడానికి పోలీసు కస్టడీకి అనుమతించాలని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈమేరకు మంగళవారం రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున మొత్తం 12 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. దాంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఐబొమ్మ రవిని చంచల్‌గూడ జైల్లో అదుపులోకి తీసుకోనున్నారు.

Updated Date - Dec 17 , 2025 | 04:56 AM