Ibomma Ravi Case: ఐబొమ్మ రవి కేసు.. కీలక సమాచారం రాబట్టిన అధికారులు..
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:35 PM
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగిసింది. 5 రోజుల కస్టడీలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. రవి కస్టడీకి సంబంధించి రేపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించనున్నారు.
ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి మరికాసేపట్లో కస్టడీ ముగియనుంది. 5 రోజుల కస్టడీలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. రవి వెబ్ సైట్, డొమైన్ నెట్ వర్క్, ఐపీ మాస్క్‌లతో పాటు అన్నింటిపై పోలీసులు ఆరా తీశారు. 20 కోట్ల రూపాయల లావాదేవీలపై బ్యాంకు అధికారుల సహకారంతో బదిలీ వివరాలు తెప్పించుకుని మరీ పోలీసులు రవిని ప్రశ్నించారు. రవి స్నేహితులు, చెల్లెలు చంద్రిక వ్యవహారంపై వివరాలు సేకరించారు.
రవి, అతడి స్నేహితుడు కలిసి టెక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్, వీపీఎన్, ఐపీ మాస్కింగ్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. రవికి, రవి స్నేహితుడు నిఖిల్‌కి మధ్య భారీగా డబ్బుల బదిలీలు జరిగినట్లు తేలింది. క్రిప్టో ద్వారా అమౌంట్ బదిలీ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 1xbet యాప్ మాత్రమే కాకుండా ఇతర యాప్‌ల ద్వారా కూడా డబ్బులు సంపాదించినట్లు తేలింది.
పోలీసుల ప్రశ్నలకు ‘నేను ఒక్కడినే అన్ని చేశాను. నా వెనుక ఎవరూ లేరు’అని రవి చెప్పినట్లు సమాచారం. రవి కస్టడీకి సంబంధించి మంగళవారం హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశం నిర్వహించనున్నారు. ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో 5 కేసులు నమోదు అయ్యాయి. మిగతా కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు పిట్ వారెంట్ దాఖలు చేశారు. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపనున్నారు. పిట్ వారెంట్ ద్వారా మరోసారి విచారణకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి
పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..
ఆ పోస్టులు డిలీట్ చేసిన స్మృతి!