Share News

Cadre Allocation: ఐఏఎస్‌ ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకు

ABN , Publish Date - Jun 25 , 2025 | 07:58 AM

ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)లో ఊరట లభించింది. తనను ఏపీ క్యాడర్‌కు కేటాయించడం తగదని.. తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ అనుమతించింది.

Cadre Allocation: ఐఏఎస్‌ ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకు

  • ఐఏఎస్‌ ఆమ్రపాలి మళ్లీ తెలంగాణకు

ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)లో ఊరట లభించింది. తనను ఏపీ క్యాడర్‌కు కేటాయించడం తగదని.. తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ అనుమతించింది. ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. తనను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని ఆమ్రపాలి చేసిన దరఖాస్తును గత ఏడాది డీవోపీటీ (కేంద్రం) తిరస్కరించింది. దీంతో ఆమె ఏపీ క్యాడర్‌లో చేరి పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా పనిచేస్తున్నారు. కాగా, డీవోపీటీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆమ్రపాలి దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా లతా బసవరాజ్‌ పాట్నే, వరుణ్‌ సింధు కుల్‌ కౌముది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొంతమంది అధికారుల విషయంలో కఠినంగా అమలు చేయడం, మరి కొంతమంది అధికారులకు మినహాయింపు ఇవ్వడం సమంజసం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు 2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి పిటిషన్‌ను అనుమతిస్తూ ఆమెను తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని క్యాట్‌ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jun 25 , 2025 | 07:59 AM