దేవరకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : బాలునాయక్
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:02 AM
దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు.
దేవరకొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : బాలునాయక్
డిండి, మే 31(ఆంధ్రజ్యోతి): దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు. మండలంలోని చెర్కుపల్లిలో శనివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనకు దేవరకొండను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల లో డిండి మండలంలో అభివృద్ధి కుం టుపడిందని తెలిపారు. డిండి ఎత్తిపోతలకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1800 కోట్లు కేటాయించదని తెలిపారు. టెం డర్ల ప్రక్రియ పూర్తి చేసుకొని త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్ర భుత్వం పనిచేస్తుందన్నారు. దేవతపల్లితండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరుకలి వెంకటయ్య విగ్రహాన్ని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరా వు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజే్‌షరెడ్డి, పీఏసీఎస్ చైర్మన నాగార్జునరెడ్డి, గుర్రం రాములు, నాయకులు జంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, పోలం లక్ష్మణ్, బాదమోని శ్రీనివా స్‌గౌడ్, నూకం వెంకటేష్, గడ్డమీదిసాయి, సలయ్య, పో షాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అన్ని గ్రామాలకు బస్సులు నడపాలి
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని రోడ్డు సౌ కర్యం ఉన్న అన్ని గ్రామాలకు బస్సులు నడపాలని ఎమ్మె ల్యే బాలునాయక్ ఆర్టీసీ అధికారులను కోరారు. దేవరకొండ ఆర్టీసీ డిపోను శనివారం ఆయన సందర్శించి అధికారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమవుతున్నందున విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడపాలని కోరారు. ఆర్టీసీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘ నత ముఖ్యమంత్రి రేవంతరెడ్డికే దక్కిందని తెలిపారు. అ నంతరం దేవరకొండ డిపో అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనున్న ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో దేవరకొండ ఆర్టీ సీ సీఐ సైదులు, ఆర్టీసీ ఉద్యోగసంఘాల నాయకులు నిర్మ ల, కాంగ్రెస్ నేతలు సిరాజ్‌ఖాన, శ్రీశైలంయాదవ్, మాజీ సర్పంచ పున్న వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.