kumaram bheem asifabad- అటు ఇష్టం.. ఇటు కష్టం..
ABN , Publish Date - Dec 01 , 2025 | 10:12 PM
ఊరికి ఒక్కసారైనా సర్పంచ్ కావాలనే కల చాలా మందికి ఉంటుంది. ప్రథమ పౌరుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఎన్నికల్లో పోటీకి ఏళ్లతరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఉన్నారు
- ఎన్నికల ఖర్చుకు సరిపడా డబ్బులు లేక వెతలు
- సర్దుబాటుకు తీవ్ర ప్రయత్నాలు
- చేతిలో చిల్లిగవ్వ లేకున్నా.. పోటీకి సై అంటున్న అభ్యర్థులు
వాంకిడి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఊరికి ఒక్కసారైనా సర్పంచ్ కావాలనే కల చాలా మందికి ఉంటుంది. ప్రథమ పౌరుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశతో ఎన్నికల్లో పోటీకి ఏళ్లతరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఉన్నారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీల పరిధిలో 2,874 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో మొత్తం 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషు లు, 1,77,269 మంది మహిళలు, 20 మంది ఇతరులు ఉన్నారు. పాత రిజర్వేషన్లను రోటేషన్ పద్ధతిలో మారుస్తూ రిజర్వేషన్లను ఖరారు చేశా రు. చాలా మందికి రిజర్వేషన్లు కలిసి వచ్చాయి. రిజర్వేషన్లు అనుకూలించని వారు తమ భార్య, తల్లీ, కూతరులను బరిలో దించేందుకు సిద్ధమ య్యారు. ఇప్పటికే మొదటి విడతల ఎన్నికల నామి నేష్ల ఘట్టం పూర్తి అయింది. సర్పంచ్ కావాలనే కల కళ్ల ముందు ఉన్నా... ఖర్చులను చూస్తే అభ్య ర్థులకు దడ మొదలవుతుంది. సర్పంచ్‌గా పోటీ చేయాలని ఆశ..కాని ఖర్చులను భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంసలో అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వ చ్చి పోటీకి ఉత్సాహం ఉన్నా చేతిలో చిల్లిగవ్వలేక ఆశావహులు నిరాశలో ఉన్నారు. తాజామాజీ సర్పంచులకే చేసిన పనులకు బిల్లులు రాక ఇంకా అవస్థలు పడుతున్నతీరు.. పోటీదారులకు అప్పు చేయడానికి మనుసుఒప్పుకోవడంలేదు. ప్రధాన పార్టీల మద్దతు కావాలన్నా... నీ చేతిలో ఎంత ఉందో ముందు చెప్పు.. అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి తోడు రియల్ బూమ్ లేకపోవ డం, పంటల ఆదాయం అంతంతే ఉండడంతో అభ్యర్థులను కాసుల కష్టాలు వెంటాడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదటి విడిత పూర్తై రెండవ విడిత ప్రారంభం కావడంతో నామినేషన్ వేస్తున్న అభ్యర్థులు తెలిసినోళ్లందరికి ఫోన్లు చేస్తూ నీ దగ్గర ఏమైనా ఉంటే సర్దుబాటు చేయమంటూ పడరాని పాట్లుపడుతున్నారు.
- పోటీ సరే..కాసులెలా..?
అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్.. ఏ ఎన్నికైన కాసులతో ముడిపడి ఉంది. ప్రచారంలో ప్రత్యర్థుల కు ధీటుగా రంగంలో ఉండాలంటే క్యాడర్ అభ్యర్థి వెనుక నిలబడాలంటే ప్రతి రోజు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖర్చు చేయకుంటే క్యాడర్ తమ వెంట ఉండరన్న భయంతో అభ్యర్థులకు ఖర్చుల టెన్షన్ పట్టుకుంది. ఎన్నికల్లో బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ప్రచార వాహనాలు, రోజువారి క్యాడర్ ఖర్చు, పోల్‌మేనేజ్‌మెంట్, వీటన్నింటికి తోడు మందు, మాంసం సమకూర్చల్సి ఉంటుంది. ఇలా ఎన్నికల వ్యయం తడిసిమోపెడు అవుతుందనే టెన్షన్‌లో అభ్యర్థులు ఉన్నారు. వెయ్యి ఓట్ల లోపు గ్రామ మైతే తక్కువలో తక్కువగా రూ. 5 నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చు అవుతుందనే అంచనాల్లో ఉన్నారు. పెద్ద పంచాయతీల్లో ఖర్చు 20 లక్షలకు పైగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఏకగ్రీవం ఆశావాహులను ఊరిస్తోంది. ఎవరితో పోటీ లేకుండాప్రచార లొల్లి, ఖర్చుల బాద లేకుం డా సర్పంచ్ సీటులో కూర్చోవచ్చనని ఉవ్విళ్లురు తున్నవారు కూడా ఉన్నారు. అయితే ఏకగ్రీవం పేరుతో ఊరి అభివృద్దికి, పోటీ ననుంచి తప్పకు నేవారికి, చివరికి ఓటర్లకు దావత్ ఇలా ఖర్చుల మీద ఖర్చులు తప్పవనే ప్రచారం ఉంది. ప్రతీ పనికి పైస కవాల్సిందే. పంచాయతీ ఎన్నికల్లో పైసా లేనిది ప్రచారం లేదని.. క్యాడర్ ఉండరనే ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. దీంతో చేతిలో చిల్లీ గవ్వ లేకున్నా.. మద్దతుదారుల ప్రోత్సహంతో సర్పంచ్ బరిలో దిగుతున ్న అభ్యర్థులను కాసుల కష్టాలు కలవరపెడుతున్నాయి. జనరల్ స్థానాల్లో ఖర్చు మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉండడం తో అభ్యర్థులు ప్రత్యర్థులకు దీటుగా ప్యూహర చనలు చేస్తున్నారు.
- కలవర పరుస్తున్న పరిస్థితి..
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేస్తు న్నాననే ఆనందం ఒకవైపు..ఎన్నికల ఖర్చులకు అప్పు ఎట్లా అనే ఆందోళన మరోవైపు అభ్యర్థులను కలవర పరుస్తున్న పరిస్థితి నెలకొన్నది. తెలిసినోళ్లం దరికి ఫోన్ చేసి అప్పుకోసం బతిమిలాడాల్సి వస్తుంది. అన్నా...సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డా నా వద్ద ఐదారు లక్షలున్నాయి.నీదగ్గర ఐదో ఆరో లక్షలు ఉంటే సర్దు అన్నా... ఎన్నికలయ్యాక ఎట్లనో తేర్చుతా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అభ్యర్థులు వడ్డీ వ్యాపారులను కూడా అశ్రయిస్తు డబ్బులు తీసుకుంటున్నారు. కొంత మంది నెలనెలా వేసిన చిట్టీలను పాడి సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది తమకు ఉన్న కొంత మేర సాగు భూము లను సైతం అమ్ముకోవడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఎన్నికల్లో ప్రచారం, విందులు, మందు, డబ్బు పంపకాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని, మరింత భారం పడనుందని ఓటర్లను మచ్చిక చేసుకుని సంతృప్తి పరచడానికి ఎక్కవ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆశావహులు వాపోతున్నారు. ఇంత ఖర్చు చేసినా.. విజయం వరిస్తుందా..? లేదా ? అని మరికొందరు ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.