ప్రాణవాయువు కొనాల్సిందే..!
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:45 AM
రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించిన అత్యవసర పరిస్థితిలో ప్రాణవాయువు అందించడం కష్టమవుతోంది.
ప్రాణవాయువు కొనాల్సిందే..!
అవసరాన్ని బట్టి దిగుమతి
ఒక్కో ఆక్సిజన సిలిండర్‌కు రూ.600 చెల్లింపు
ఆర్థికంగా నష్టపోతున్న పేదలు
మిర్యాలగూడఅర్బన, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): రోగుల ఆరోగ్య పరిస్థితి విషమించిన అత్యవసర పరిస్థితిలో ప్రాణవాయువు అందించడం కష్టమవుతోంది. ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిన క్షతగాత్రుల కు ఆక్సీజన దొరకని పరిస్థితి నెలకొంది. అవసరాన్ని బట్టి ప్రైవేట్ కంపెనీ నుంచి సిలిండర్లను కొనుగోలు చేయాల్సిన వస్తోంది. ఇదీ మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పరిస్థితి. వంద పడకల సామర్థ్యంతో నిర్మితమైన ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో ఆక్సీజన కొరత ఏర్పడుతోంది. ప్రసూతి వార్డులో సాధారణ ప్రసవాలకు వీలు పడని సందర్భాల్లో సిజేరియన చేయాల్సి వస్తే ఆపరేషన థియేటర్‌లో ఆక్సీజన సిలిండర్‌ను సమకూర్చుకునేందుకు వైద్యులు తాపత్రయపడాల్సి వస్తోంది. ఇదే ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 10 యూనిట్ల ద్వారా డయాలసిస్ రోగులకు రక్తశుద్ధి చేస్తున్నారు. నిత్యం 35 నుంచి 40మంది రోగులు ఇక్కడ డయాలసిస్ సేవ లు పొందుతున్నారు. శాస్వకోశ వ్యాధి లక్షణాలు కలి గి ఉన్న రోగులకు ఆక్సీజన అందించక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్ కంపెనీల నుంచి దిగుమతి చేసుకునే ఆక్సీజన సిలిండర్లను వాడాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సిలిండర్‌కు రూ.600 వరకు ఖర్చు చేస్తున్నారు. ఆస్పత్రిలో ఇనపేషెంట్ వార్డు, అత్యవసర గదిలో రోగుల సంఖ్య పెరిగిన సందర్భాల్లో వారానికి 10 ఆక్సీజన సిలిండర్లను వినియోగిస్తుంటారు. అందుకు సగటున రూ.6 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆక్సీజన ప్లాంట్ ఏర్పాటు తో విద్యుత వినియోగం పెరిగి కరెంటు బిల్లు భారం అధికమవుతుందన్న భావనతో ఆస్పత్రిలో ప్లాంట్ ఏ ర్పాటుకు అంతగా శ్రద్ధ చూపడం లేదు. దీంతో కొన్నేళ్లుగా బహిరంగ మార్కెట్లో లభించే ప్రైవేట్ కంపె నీ ఆక్సీజన సిలండర్లను వినియోగిస్తున్నారు. అందు కు ప్రతీ నెలా రూ.50 నుంచి 80 వేల వరకు ప్రైవేట్ కంపెనీలకు ఆక్సీజన సిలిండర్ బిల్లులు చెల్లిస్తున్నా రు. తాజాగా మరో వంద పడకల సామర్థ్యంతో నూ తన ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఈ భవనం వినియోగంలోకి తెచ్చే సందర్భంలో ఆక్సీజన ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనలో వైద్యశాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆక్సీజన ప్లాంట్‌తో అధిక భారం
దేవరకొండ: దేవరకొండ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో 2020లో నేషనల్ హైవే అథారిటీ, కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో డీఆర్‌డీవో ద్వారా రూ.5 కోట్లతో ఆక్సీజన ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లాంట్‌ను ఉపయోగంలోకి తెస్తే విద్యుత బిల్లు అధికమవుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొంటున్నారు. 2020లో కరోనా విజృంభిస్తుండటంతో కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సీజన ప్లాంట్లను ఏర్పాటు చేసింది. కాని నిర్వహణ లేకపోవడంతో ఆ ప్లాంట్ నిరుపయోగంగా మారింది. ఆక్సీజన ప్లాంట్ ఉపయోగంలో లేకున్నా విద్యుత బిల్లు నెలకు రూ.30వేల వరకు వస్తుందని, దీంతో ఆర్థికంగా భారమవుతుందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వంద పడకలకు గాను ప్రతీ రోజు 700 నుంచి 800 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో ఆక్సీజన ప్లాంట్‌తో పాటు ఆక్సీజన సిలిండర్లు రోగులకు సరిపడా ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రిని సందర్శించి అత్యవసర సమయంలో ఆక్సిజన అవసరాల నిమిత్తం రూ.1.50 లక్షల వ్యయంతో ఆక్సీజన కన్సనడేటర్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సీజన కొరత లేదని ప్లాంట్ ఉపయోగంలోకి తెస్తే విద్యుత భారమవుతుందని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.
ఆక్సీజన ప్లాంట్‌తో అధికభారం
దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి 2020లో ఆక్సీజన ప్లాంట్ మంజూర,ఐంది. నిర్వహణ భారం మాపైనే పడింది. ఉపయోగించకున్నా విద్యుత బిల్లు అధికంగా వస్తుంది. ప్లాంట్‌తో పాటు సిలిండర్లు, ఆక్సీజన కాన్సనడేటర్లు ఆసుపత్రిలో రోగులకు సరిపడా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆక్సీజన ప్లాంట్‌తోనే అధికభారం అవుతుంది.
- డాక్టర్ రవిప్రకాష్, సూపరింటెండెంట్, దేవరకొండ
సిలిండర్లు దిగుమతి చేసుకుంటున్నాం
ఆస్పత్రిలో ఆక్సీజన వినియోగాన్ని బట్టి ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేసే ఆక్సీజన సిలిండర్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఆస్పత్రిలో ఆక్సీజన ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడంతో బహిరంగ మార్కెట్లో లభించే సిలిండర్లను వాడాల్సి వస్తోంది. కంపెనీల నాణ్యతప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆక్సీజన సిలిండర్లు అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ శ్రీనివాస్ సమరద్, సూపరింటెండెంట్,మిర్యాలగూడ