Share News

నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:03 PM

మంచిర్యాల నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి’ని అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మా ణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనంతోపాటు ప్రభుత్వ కళా శాల, పాఠశాల నిర్మాణం పనులను నాయకులతో కలిసి పరిశీలిం చారు.

నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి
ప్రభుత్వ కళాశాల భవనం పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘మంచిర్యాల నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రి’ని అని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మా ణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనంతోపాటు ప్రభుత్వ కళా శాల, పాఠశాల నిర్మాణం పనులను నాయకులతో కలిసి పరిశీలిం చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి పదవి రాలేదని బాధపడేది లేదన్నారు. జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వచ్చిన నా మంచిర్యాల నియోజకవర్గంలో తనదే చివరి నిర్ణయమన్నారు. తనకు బాస్‌ జిల్లాలో మంత్రులు కాదని, సీఎం రేవంత్‌రెడ్డే తన బాస్‌ అ న్నారు. 25 ఏళ్ల నుంచిపార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం నేను కష్టప డ్డ విషయం అందిరికీ తెలుసన్నారు. తనకు పార్టీ అభివృద్ధే ముఖ్యం అన్న విషయం అధిష్టానానికి కూడా తెలుసన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ అంటే ఎంటో ఇంద్రవెల్లి సభతో చూపించిన సంగతి ప్రతీ ఒక్కరికి తెలుసన్నారు. మన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో కాం గ్రెస్‌ పార్టీ జెండా కనపడకుండా అప్పటి నాయకులు చేసినా కూడా భయపడకుండా తన వెన్నంటే ఉన్న కార్యకర్తలతో కలిసి ఇంద్రవెల్లి సభ సమయంలో ప్రతీ ఇంటిపై కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగిరేలా చేసా నన్నారు. తనకు పదవులు, డబ్బు ముఖ్యం కాదని, కార్యకర్తలు, కాం గ్రెస్‌ పార్టీ మాత్రమే ముఖ్యమన్నారు. రానున్న రోజుల్లో మంత్రి పద వికంటే పెద్ద పదవి తనకు వచ్చే సందర్భం కూడా ఉందన్నారు. ప ట్టణంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న భవనాలు ఈనెల 12న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈకార్యక్ర మంలో ఎమ్మెల్యే వెంట మార్కెట్‌ కమిటి చైర్మన్‌ ప్రేమ్‌చంద్‌, వైస్‌ చై ర్మన్‌ ఆరీఫ్‌, పార్టీ మండల అద్యక్షుడు పింగిళి రమేష్‌, ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూషణం, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి, పూర్ణచందర్‌రావు, చింత అశోక్‌ ఉన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:03 PM