అచ్చంపేట ప్రజలకు రుణపడి ఉంటా
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:04 PM
అచ్చంపేట ప్రజలకు రుణపడి ఉంటానని, వారి అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉంటానని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
- బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : అచ్చంపేట ప్రజలకు రుణపడి ఉంటానని, వారి అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉంటానని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండల పరిధిలోని బొమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు శనివారం గు వ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అం దించే పథకాలలో సగానికి పైగా కేంద్ర ప్రభు త్వం మోదీ అందించేవని అన్నారు. అచ్చంపేట అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. అచ్చంపేటను అన్ని విధాలా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రంతో మాట్లాడుతానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గంలో గ్రామాలలో అత్యధిక స్థానా ల్లో కాషాయం జెండా ఎగరవే స్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్ ధర్మానాయక్, రాష్ట్ర నాయకులు మంగ్యా నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు కాట్రావత్ జ్యోతి, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఫీలింబోర్డ్ మెంబర్ శ్రీను, నాయకులు, యువ నాయకులు శంకర్ మాదిగ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.