Hydropower Generation Halted at Srisailam: శ్రీశైలం, సాగర్‌లో విద్యుదుత్పత్తికి బ్రేక్
ABN , Publish Date - Nov 14 , 2025 | 04:11 AM
గువనుంచి వరద రాక గణనీయంగా తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు...
ఇన్ ఫ్లో లేక ఉత్పత్తిని నిలిపేసిన జెన్‌కోలు
హైదరాబాద్, నాగార్జున సాగర్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎగువనుంచి వరద రాక గణనీయంగా తగ్గిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. గురువారం నుంచి శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్ వద్ద ఇరువైపులా జలవిద్యుత్ కేంద్రాల్లో తెలంగాణ, ఏపీ జెన్‌కోలు విద్యుదుత్పత్తిని ఆపివేశాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇక, ఇన్‌ఫ్లో తగ్గటం తో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఈ ఏడాది లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు కాగా బుధవారం సాయంత్రానికి 2,265 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశామని, దీంతో జెన్‌కోకు రూ. 450కోట్ల ఆదాయం సమకూరిందని సీఈ మంగేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 15 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 305.75 టీఎంసీల నిల్వ ఉంది.