Share News

World Best Cities: ప్రపంచ టాప్‌ 100 నగరాల్లో హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:37 AM

ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్‌-100 నగరాల్లో హైదరాబాద్‌ స్థానం సంపాదించింది. దేశం నుంచి మూడు నగరాలకు ఈ ఘనత దక్కింది...

World Best Cities: ప్రపంచ టాప్‌ 100 నగరాల్లో హైదరాబాద్‌
World Best Cities

  • అత్యుత్తమ నగరాల్లో 82వ స్థానం

  • ‘వరల్డ్‌ బెస్ట్‌ సిటీస్‌’ నివేదికలో వెల్లడి

  • 29వ స్థానంలో బెంగళూరు, ఢిల్లీకి 54వ ర్యాంకు

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్‌-100 నగరాల్లో హైదరాబాద్‌ స్థానం సంపాదించింది. దేశం నుంచి మూడు నగరాలకు ఈ ఘనత దక్కింది. బెంగళూరు 29, ఢిల్లీ 54వ స్థానంలో నిలవగా హైదరాబాద్‌ 82వ స్థానం సాధించింది. మౌలిక వసతులు, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే చారిత్రక పర్యాటక ప్రాంతాలు, ఆర్థికాభివృద్ధి, మెరుగైన జీవన ప్రమాణాలతోపాటు నివాసానికి అనుకూలంగా ఉండే ఇతర వసతులను పరిగణనలోకి తీసుకుని ‘2026 వరల్డ్‌ బెస్ట్‌ సిటీస్‌’ నివేదిక రూపొందించినట్టు ఆ నివేదిక రూపొందించిన రెసొనెన్స్‌ కన్సల్టెన్సీ సీఈవో క్రిస్‌ ఫెయిర్‌ తెలిపారు.


టాప్‌-5 నగరాల్లో లండన్‌, న్యూయార్క్‌, పారిస్‌, టోక్యో, మాడ్రిడ్‌ నిలిచాయి. హైదరాబాద్‌ విశేషతల గురించి నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. చారిత్రక కట్టడాలు చార్మినార్‌, గోల్కొండ కోటలతో నగరం అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన విదేశీ పర్యాటకులు నగరంలోని విశేషతలు, వారసత్వ సంపదపై అత్యంత సంతృప్తిగా ఉన్నారని, వారసత్వ నగరంగా ప్రపంచానికి చాటి చెబుతున్నారని నివేదిక తెలిపింది. మరోవైపు గూగుల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఉంటూ ఐటీ రంగంలోనూ ప్రత్యేకత చాటుతోందని ప్రశంసించింది. పాతబస్తీ పర్యాటక ప్రాంతాలు, హైటెక్‌ సిటీ ఆధునికతతో కలబోసిన హైదరాబాద్‌ ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా నిలుస్తోందని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Young Sub-Inspectors: దోచుకునేందుకే పోలీస్ డిపార్టుమెంట్‏లోకి...

Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

Updated Date - Nov 27 , 2025 | 07:49 AM