Share News

Hyderabad Poised to Become Global Hub: రక్షణ, అంతరిక్ష రంగాలకు హైదరాబాదే బెస్ట్‌

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:46 AM

రక్షణ, అంతరిక్ష రంగాల్లో పరిశోధన/అభివృద్ధి ఆర్‌అండ్‌బీతో పాటు ఉత్పత్తుల పరంగా హైదరాబాద్‌ నగరం ప్రపంచానికి కేంద్రంగా మారనుందని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీ్‌షరెడ్డి తెలిపారు.....

Hyderabad Poised to Become Global Hub: రక్షణ, అంతరిక్ష రంగాలకు హైదరాబాదే బెస్ట్‌

  • ఈ రంగాల్లో గ్లోబల్‌ హబ్‌గా ఎదగనున్న నగరం

  • డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీ్‌షరెడ్డి

  • రక్షణ రంగ అభివృద్ధికి సూచనలివ్వండి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రక్షణ, అంతరిక్ష రంగాల్లో పరిశోధన/అభివృద్ధి(ఆర్‌అండ్‌బీ)తో పాటు ఉత్పత్తుల పరంగా హైదరాబాద్‌ నగరం ప్రపంచానికి కేంద్రంగా మారనుందని డీఆర్‌డీవో మాజీ చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీ్‌షరెడ్డి తెలిపారు. ఈ రంగాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు మరింత వేగంగా ప్రగతి సాధించేందుకు నిపుణులు సూచనలు ఇవ్వాలని కోరారు. సతీ్‌షరెడ్డి అధ్యక్షతన రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్యానల్‌ చర్చ జరిగింది. ఈ చర్చలో మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఈడీ మసూద్‌ హుస్సేనీ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) సీఎండీ మాధవరావు, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జయతీర్థ్‌ రాఘవేంద్ర జోషి, అనంత్‌ టెక్నాలజీస్‌ ఎండీ సుబ్బారావు, స్కైరూట్‌ ప్రతినిధి నాగభరత్‌, సాఫ్రాన్‌ కంపెనీ సీఈవో జితేంద్ర గవాంకర్‌ పాల్గొన్నారు. సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలోని రక్షణ, అంతరిక్ష రంగ పరిశ్రమలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నాయో నివేదిక రూపంలో అందించాలని సూచించారు. మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చటంలో రక్షణ, అంతరిక్ష రంగాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు వాడే హెలికాప్టర్‌లోని పరికరాలు హైదరాబాద్‌లోనే తయారయ్యాయని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మసూద్‌ హుస్సేనీ తెలిపారు. రాఫెల్‌ విమాన ఫ్యూజ్‌లేజ్‌ లలో 50 శాతం హైదరాబాద్‌లోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.


రాష్ట్రంలో మరో మూడు బీడీఎల్‌ యూనిట్లు: మాధవరావు

రానున్న రోజుల్లో తెలంగాణలో బీడీఎల్‌ మరో మూడు యూనిట్లను నెలకొల్పనుందని ఆ సంస్థ సీఎండీ మాధవరావు ప్రకటించారు. రాష్ట్రంలో 3,500 కంపెనీలు రక్షణ ఉత్పత్తులను అందించడానికి 25 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకోగా, వాటిలో 1,500 వరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరం రక్షణ, అంతరిక్ష పరిశ్రమకు హబ్‌గా మారిందని చెప్పారు. అస్త్ర క్షిపణి తయారీ కోసం త్వరలో మెదక్‌లో 1,000 ఎకరాల్లో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఇబ్రహీంపట్నంలో కూడా 500 ఎకరాల్లో ఒక యూనిట్‌తోపాటు పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కోర్‌ ఇంజినీరింగ్‌ (మెటలర్జీ, ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌) రంగంలో నిపుణులు దొరకడం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ డీజీ జయతీర్థ్‌ రాఘవేంద్ర జోషి కోరారు. రక్షణ రంగ కంపెనీల ఏర్పాటుకు దేశంలో మరే రాష్ట్రానికి లేని అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు శాటిలైట్‌ ఆధారిత టెక్నాలజీ బదిలీ కావాల్సిన అవసరం ఉందని అనంత్‌ టెక్నాలజీస్‌ ఎండీ సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రైవేట్‌ రంగంలో తొలి రాకెట్‌ను హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేసినట్లు స్కైరూట్‌ సంస్థ ప్రతినిధి నాగభరత్‌ గుర్తుచేశారు. రాఫెల్‌, ఫాల్కన్‌ విమానాల ఇంజిన్ల విడిభాగాలను హైదరాబాద్‌లో ఉత్పత్తి చేస్తున్నామని సాఫ్రాన్‌ కంపెనీ సీఈవో జితేంద్ర గవాంకర్‌ వెల్లడించారు.

తెలంగాణలో ఏరో స్పేస్‌ వర్సిటీ ఏర్పాటు చేయాలి: సతీ్‌షరెడ్డి

తెలంగాణలో ఏరో స్పేస్‌ యూనివర్సిటీని ఏర్పాటుచేయాలని సతీ్‌షరెడ్డి సూచించారు. వర్సిటీ ఏర్పాటువల్లఈ రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్యానల్‌ చర్చ అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏరోస్పేస్‌ అభివృద్ధిపై ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉంది. అందుకోసమే సమ్మిట్‌లో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చ నిర్వహించింది. అంతరిక్ష రంగంలో ప్రపంచ స్థాయి తయారీదారుగా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై చర్చ జరిగింది. రాష్ట్ర యువతలో ఏరోస్పేస్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌కు కావాల్సిన నైపుణ్యాలను పెంచాలి. అందుకోసం ఏరోస్పేస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించాం. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

Updated Date - Dec 09 , 2025 | 03:46 AM