Share News

Madinah Burial: 45 మంది హైదరాబాదీలకు..మదీనలో అంత్యక్రియలు పూర్తి

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:33 AM

సౌదీ అరేబియాలో తీర్థ యాత్రకు వచ్చి ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది హైదరాబాదీలతో పాటు మరొకరికి మదీనలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.

Madinah Burial: 45 మంది హైదరాబాదీలకు..మదీనలో అంత్యక్రియలు పూర్తి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): సౌదీ అరేబియాలో తీర్థ యాత్రకు వచ్చి ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 45 మంది హైదరాబాదీలతో పాటు మరొకరికి మదీనలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల గుర్తింపునకు రెండు విడుతల్లో డీఎన్‌ఏ ఫలితాలు అందిన అనంతరం పోలీసులు శనివారం మృతదేహాలను అప్పగించారు. దీంతో మధ్యాహ్నం జన్నతుల్‌ బఖీ శ్మశాన వాటికలో మృతదేహాలను ఖననం చేశారు.

45 మంది హైదరాబాద్‌ నుండి సౌదీకి రాగా, మరొకరు దుబాయ్‌ నుండి వచ్చి ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్‌ యాత్రికులతో మక్కా నుంచి మదీన వెళ్తున్న బస్సు ఈ నెల 16న అర్ధరాత్రి డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడం తో బస్సుకు మంటలంటుకున్నాయి. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నేత, ఏపీ గవర్నర్‌ షేక్‌ అబ్దుల్‌ నజీర్‌, తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌, భారత రాయబారి డాక్టర్‌ సుహేల్‌, భారత కాన్సుల్‌ జనరల్‌ ఫహాద్‌, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌ ఖాన్‌లు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 06:49 AM