Share News

Hyderabad Metro: మెట్రో టికెట్‌ ధర 10 శాతం తగ్గింపు

ABN , Publish Date - May 21 , 2025 | 08:00 AM

హైదరాబాద్‌ మెట్రో టికెట్‌ ధరలపై 10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపు 24 నుంచి అమలులోకి రానుంది.

Hyderabad Metro: మెట్రో టికెట్‌ ధర 10 శాతం తగ్గింపు

హైదరాబాద్‌ సిటీ, మే 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రో టికెట్‌ ధరలను ఇటీవల పెంచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ.. సవరించిన ధరలపై తాజాగా 10 శాతం తగ్గింపును ప్రకటించింది. తగ్గిన ధరలు ఈ నెల 24 నుంచి అమలులోకి వస్తాయని మంగళవారం వెల్లడించింది. నగరంలో మెట్రో రైలు ప్రారంభించిన 2017 తర్వాత తొలిసారిగా ఫేర్‌ ఫిక్సేషన్‌ కమిటీ (ఎఫ్‌ఎ్‌ఫసీ) నివేదిక ఆధారంగా ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఇటీవల 20 నుంచి 42.8 శాతం వరకు రేట్లను పెంచింది. ఇందులో భాగంగా కనిష్ఠంగా రూ.2 నుంచి.. గరిష్ఠంగా రూ.16 వరకు ధరలను పెంచింది. దీంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గతంతో పోల్చితే తమపై రూ.15 నుంచి రూ.16 అదనపు భారం పడుతోందని, పెంచిన చార్జీలను తగ్గించాలని రెండు రోజుల క్రితం నాగోల్‌లోని ఎల్‌ అండ్‌ టీ ప్రధాన కార్యాలయం ఎదుట ప్రయాణికులు భారీ ధర్నా చేపట్టారు. ఓ వైపు ప్రయాణికుల నుంచి వ్యతిరేకత, మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలతో ఎల్‌ అండ్‌ టీ అధికారులు సవరించిన రేట్లపై 10 శాతం రాయితీని ప్రకటించారు.

Updated Date - May 21 , 2025 | 08:01 AM