Hyderabad Metro Ownership: మార్చి 31లోగా మెట్రో యాజమాన్య బదిలీ!
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:14 AM
హైదరాబాద్ మెట్రోలో తన వాటాల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తవుతుందని లార్సన్ అండ్ టర్బో కంపెనీ ప్రకటించింది...
బీఎ్‌సఈకి సమాచారం ఇచ్చిన ఎల్ అండ్ టీ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రోలో తన వాటాల ఉపసంహరణ ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తవుతుందని లార్సన్ అండ్ టర్బో కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజికి సమాచారం ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)ని స్వాధీనం చేసుకోనుందని వెల్లడించింది. ప్రస్తుత అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, ఎల్ అండ్ టీ వాటాలను అంగీకరించిన రేటుకు తీసుకుంటోందని తెలిపింది. ఎల్ అండ్ టీ ప్రకటనతో మెట్రో యాజమాన్య బదిలీ మార్చి 31లోగా పూర్తవుతుందని భావించాల్సి వస్తుంది.