Amberpet Case: కుటుంబం ఆత్మహత్య
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:36 AM
ఆరు నెలల క్రితం ఆ ఇంటి ఆడపిల్ల బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణంతో మనస్తాపం చెందారో ? ఆర్థిక ఇబ్బందుల వల్లనో స్పష్టత లేదు కానీ..
కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల బలవన్మరణం
ఇటీవలే పెద్దకుమార్తె ఆత్మహత్య
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో..
అంబర్‌పేట్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరు నెలల క్రితం ఆ ఇంటి ఆడపిల్ల బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మరణంతో మనస్తాపం చెందారో ? ఆర్థిక ఇబ్బందుల వల్లనో స్పష్టత లేదు కానీ.. ఆ కుటుంబంలో మిగిలిన ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు బిడ్డల్లో తమకు మిగిలిన ఒక్క కుమార్తెతో కలిసి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. అంబర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం వెలు గు చూసిన ఘటనలో.. శ్రీనివాస్(45), ఆయన భార్య విజయలక్ష్మి(42), వారి కుమార్తె శ్రావ్య(16) బలవన్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంనగర్ కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు కావ్య, శ్రావ్య అనే కుమార్తెలు ఉన్నారు. దంపతులిద్దరూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తుంటారు. వీరి పెద్ద కు మార్తె కావ్య ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్ కుటుంబం నెల రోజుల క్రితం అంబర్‌పేట్‌లోని రామకృష్ణానగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు చేరింది. శ్రావ్య ఇంటర్ విద్యార్థిని, కాగా, శ్రీనివాస్ నివాసముంటున్న ఇంటి నుంచి శనివారం దుర్వాసన వెలువడుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇ చ్చారు. పోలీసులు ఆ ఇంటి తలుపులు తెరిచి చూడగా శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య.. ఉరి వేసుకొని ప్రాణాలు కోల్పోయి కనిపించారు. పెద్ద కుమార్తె ఆత్మహత్యతో మానసిక ఆందోళనకు గురైన దంపతులు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నట్టు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.