Minister Ponam Prabhakar: కోనసీమలా హుస్నాబాద్ అభివృద్ధి
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:47 AM
గౌరవెల్లి రిజర్వాయర్‌తో ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు....
హుస్నాబాద్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గౌరవెల్లి రిజర్వాయర్‌తో ఈప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఉత్తర తెలంగాణకు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కోనసీమగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ నెల 3న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ హైమావతితో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 480 కోట్ల అభివృద్ది పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు. బహిరంగసభకు జన సమీకరణపై హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ రూరల్ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి పొన్నం.. జనసమీకరణలో భాగంగా ఇంటింటికెళ్లి కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు.