Husband and Wife Elected as Village Sarpanch: ఆలుమగలే గ్రామపెద్దలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:47 AM
హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు ఆ ఊరి పెద్దలయ్యారు. గ్రామానికి ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో....
భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్
పరకాల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు ఆ ఊరి పెద్దలయ్యారు. గ్రామానికి ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లెబోయిన గీతారాణి సర్పంచ్‌గా గెలుపొందారు. గీతారాణి భర్త పల్లెబోయిన రాజు వార్డు మెంబర్‌గా పోటీ చేసి గెలిచారు. 10 వార్డులకు 9 వార్డుల్లో బీఆర్‌ఎస్ గెలుపొందగా, ఒక వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. సర్పంచ్‌గా గీతారాణి విజయం సాధించగా, 9 వార్డులను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ మద్దతుదారులు.. సర్పంచ్ భర్త రాజును ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.