kumaram bheem asifabad- అభ్యర్థుల వేట
ABN , Publish Date - Oct 01 , 2025 | 10:39 PM
స్థానిక సమరానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేట ప్రారంభ మయ్యాయి. రిజర్వేష న్ల ప్రకటన పూర్తికాగా, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి అలుముకుం టోంది. కానీ రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ కొత్త చిక్కులు మొదలయ్యాయి.
- స్థానిక ఎన్నికల్లో పట్టు కోసం ప్రధాన పార్టీల దృష్టి
- మారిన రిజర్వేషన్లతో ఆశావహుల్లో నిరాశ
బెజ్జూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేట ప్రారంభ మయ్యాయి. రిజర్వేష న్ల ప్రకటన పూర్తికాగా, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి అలుముకుం టోంది. కానీ రిజర్వేషన్ల ప్రకటనతో రాజకీయ కొత్త చిక్కులు మొదలయ్యాయి. ప్రధానంగా జిల్లా పరిష త్ చైర్మెన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించ డంతో ఆ వర్గంలో బలమైన నేత కోసం పార్టీలు అన్వేషిస్తున్నాయి. ఇక రిజర్వేషన్లు ప్రతికూలంగా ఉండటంతో మండలాల్లోనూ జడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు నేతలు కరువయ్యారు. జిల్లాలో మొత్తం 15జడ్పీటీసీ ఉన్నాయి. జడ్పీ చైర్మెన్‌ను ఎన్నుకోవా లంటే కనీసం 8మంది జడ్పీ సభ్యుల మద్దతు అవ సరం. ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటా యోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
- నోటిఫికేషన్ జారీతో..
ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి అలుముకుంటోంది. ముఖ్యంగా రిజర్వేషన్లు కొంత మందికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా రావడంతో ఆశావహు ల్లో నిరాశే ఎదురైంది. మారిన రాజకీయ సమీకరణా ల మూలంగా ఆయా మండలాల్లో అభ్యర్థుల వేట కోసం ప్రధాన పార్టీల నేతలు తలమునకలవుతు న్నారు. ఎప్పటినుంచో ఎన్నికల బరిలో ఉందామను కున్న కొందరి ఆశలకు గండి పడడంతో తప్పనిసరి గా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండక తప్పడం లేదు. ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గం లోని బెజ్జూరులో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, కౌటాలలో జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు బీసీ జనరల్, సిర్పూర్(టి)లో జడ్పీటీసీ ఎస్సీనరల్, ఎంపీపీ బీసీ జనరల్, కాగజ్‌న గర్‌లో జడ్పీటీసీ, ఎంపీపీ బీసీ మహిళకు, దహెగాంలో జడ్పీటీసీ ఎస్టీ మహిళ, ఎంపీపీకి ఎస్సీ జనరల్, పెంచికలపేటలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానా లు ఎస్సీ మహిళ, చింతలమానేపల్లిలో జడ్పీటీసీ ఎస్టీ జనరల్, ఎంపీపీబీసీ మహిళకు కేటాయిం చారు. దీంతో ఈ సారి అనుకున్న స్థానాల్లో రిజర్వేషన్లు అనుకూలించని కారణంగా కొందరికి నిరాశే మిగిలింది. అయితే అన్నిచోట్ల దాదాపు కొత్త మొఖాలనే చూడాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగ జ్‌నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరులకు రిజర్వే షన్ అనుకూలించని కారణంగా ఈ ఎన్నికల్లో పోటీ కి దూరంగా ఉండాల్సిన పరిస్థితులే ఉన్నాయి. సిర్పూర్ నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా జన రల్‌కు కేటాయించని కారణంగా జనరల్ సామాజిక వర్గానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది.
- పావులు కదుపుతున్న నేతలు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఇప్పటి నుంచే వేట ప్రారంభిం చారు. గ్రామాల్లో ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబ డి ఉన్న నేతల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో పోటీ చేసేందుకు ఎవరూ సిద్దంగా ఉన్నారనే విషయంపై స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నారు. తమకు అనుకూలంగా ఉండేవారిని బరిలో దించేందుకు పావులు కదుపుతున్నారు. అనుకున్న స్థానాల్లో రిజర్వేషన్లు అనేకూలించని కారణంగా తప్పనిసరి స్థితిలో ఇతరులకు అవకాశం ఇవ్వక తప్పడం లేదు. ఎప్పటినుంచో రాజకీయాల్లో తిరుతుగున్న నాయకు ల ఆశలు గల్లంతు కావడంతో ఏంచేయాలో తోచ డం లేదని అంటున్నారు. ఈ సారి మొత్తానికి రాజకీయాల్లో లేని వారికి అవకాశం దక్కే సూచన లు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఎవ్వరికి అవ కాశం దక్కునోనని ఆసక్తిగా చూస్తున్నారు.