41రోజుల్లో రూ2.45కోట్ల హుండీ ఆదాయం
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:38 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు 41రోజుల్లో రూ.2.45కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.
యాదగిరీశుడి హుండీ కానుకల లెక్కింపు
యాదగిరిగుట్ట, జూలై 23 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు 41రోజుల్లో రూ.2.45కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. జూన్ 12 నుంచి ఈ నెల 22 వరకు నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను దేవాదాయ కమిషనర్, ఆలయ ఈవో ఎస్. వెంకట్రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహమూర్తి పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. రూ. 2,45,48,023 నగదుతోపాటు, 38 గ్రాముల మిశ్రమ బంగారం, 2.800 కిలోల మిశ్రమ వెండి సమకూరింది. విదేశీ కరెన్సీ రూపంలో 1,036 అమెరికా డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు, 45 ఇంగ్లాండ్ పౌండ్లు, 5 సౌదీ అరేబియా రియల్, 10 సింగపూర్ డాలర్లు, 1/2 కతార్ రియల్, 500 ఓమన్ బైస, 70 అరబ్ ఎమిరేట్స్ థీరమ్స్, 500 శ్రీలంక రూపీ, 23 మలేసియా రింగిట్లు, 20 కెనడా డాలర్లు, 2 బెహ్రిన్ దినార్స్ సమకూరాయి.