శునకాలతో హడల్
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:36 AM
మండలంలోని గ్రామాల్లో గ్రామసింహాలు ప్రజలపై దాడులతో వణికిస్తూ, స్వైరవిహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
శునకాలతో హడల్
గ్రామసింహాల స్వైరవిహారం
భయాందోళనలో ప్రజలు
మర్రిగూడ, జూలై 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రామాల్లో గ్రామసింహాలు ప్రజలపై దాడులతో వణికిస్తూ, స్వైరవిహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో శునకాల సమస్య జఠిలంగా మారింది. వీధి కుక్కలపై నియంత్రణ చర్యలు లేకపోవడంతో పల్లెల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. భారత జంతువుల సంరక్షణ బోర్డు నియంత్రణకు ని బంధనలు విధించింది. ఈ నిబంధనల కారణంగా వీధి కుక్కలను చంపకపోవడంతో వీధి కుక్కలు పలు గ్రామాల్లో నాలుగు వేలకు పైగా ఉన్నట్లు అంచనా. గ్రామాల్లో నడుచుకుంటూ వెళ్తున్న ప్రజలపై వాహనదారులపై చిన్నపిల్లలపై ఎగబడి తీవ్రంగా కరుస్తూ దాడి చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కుక్కకాటుకు గురైన బాధితులు చికిత్స కోసం నిత్యం ఆస్పత్రికి వెళ్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వీధి కుక్కలు ప్రధాన కూడలి వద్ద, చికెన, మటన సెంటర్ల వద్ద, గుంపులు గుంపులుగా ఉంటున్నాయి. ఈ చికెన, మ టన సెంటర్ల వద్ద వ్యర్థ పదార్థాలు అక్కడ పడివేయడం వల్ల కుక్కలు వ్యర్థ పదార్థాలకు అలవాటు పడి స్వైరవిహారం చేస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల ప్రజలు అక్కడి నుంచి వెళ్లాలంటే పలు ఇబ్బందులు గురవుతున్నామని వెల్లడిస్తున్నారు. వీధి కుక్కల బారిన పడకుండా వాటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికారులు చొరవ తీసుకొని వీధి కుక్కలు ప్రజలపై దాడులు చేయకుండా చర్యలు తీసుకొని వాటిని వేరే చోటికి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
కుక్కల బారినుంచి కాపాడాలి
మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నా యి. స్వైరవిహారం చేస్తూ ఇవి ప్రజలను కరుస్తూ దాడులు చేయడం వల్ల కు క్కకాటుకు గురై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ముఖ్యంగా చికెన, మటన, సెంటర్ల వద్ద నిఘా ఏర్పాట్లు చేయాలి. కుక్కలను నియంత్రించి వే రే చోటికి తరలించి ప్రజలను వీధి కుక్కల బారి నుంచి రక్షించాలి.
- బూరుగు నాగరాజు, మర్రిగూడ