Huge Crowd Visits Telangana Rising Global Summit: అబ్బురం... ఆశ్చర్యం
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:51 AM
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్శనకు విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు...
గ్లోబల్ సమ్మిట్‌లో సందర్శకుల సందడి
రంగారెడ్డి అర్బన్, హైదరాబాద్ సిటీ, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్శనకు విద్యార్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్-బేగరికంచలో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. 6 ఖండాలు, 44 దేశాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఈ ప్రాంగణంలో సందడి నెలకొంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన సమ్మిట్ ప్రాంగణాన్ని సాధారణ ప్రజలు సందర్శించేందుకు ప్రభుత్వం శనివారం వరకు అనుమతించింది. దీంతో సమ్మిట్ ప్రాంగణంలోకి బుధవారం జనం భారీగా తరలి వచ్చారు. ఎంపిక చేసిన విద్యాసంస్థల నుంచి విద్యార్ధులను పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సుల్లో తరలించారు. పలు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు 2500 మంది, 2 వేల మంది ప్రజలు కూడా ఈ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏఐ రోబోలు, టచ్ కియో్‌స్కలు, త్రీడి తెరలు చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు. సమ్మిట్ జరిగే చోటకు వెళ్లేందుకు గురువారం నుంచి డిసెంబరు 13 శనివారం వరకు ఉచిత బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజశేఖర్ తెలిపారు. ఉచిత బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్‌బీనగర్, ఉప్పల్, శంషాబాద్ నుంచి ఉదయం 9, 10, 11, 12 గంటలకు ప్రాంగణానికి బయలుదే రతాయి. సాయంత్రం 4, 5, 6, 7 గంటలకు తిరుగుముఖం పడతాయి. ఇతర వివరాలకు ఈ నెంబరు 9959226160లో సంప్రదించవచ్చన్నారు.