Share News

kumaram bheem asifabad-విద్యార్థులకు హెచ్‌పీసీ కార్డులు

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:05 PM

వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థులు సాధించిన సబ్జెక్టుల వారీగా మార్కులు, హాజరు శాతం తెలిపేవిధంగా విద్యాశాఖ ప్రోగ్రెస్‌ కార్డులిచ్చేది. ఈ మేరకు విద్యా సంస్థల్లో అందిస్తున్న ప్రోగ్రెస్‌ కార్డు విధానం మారనుంది. కేవలం మార్కులకే పరిమితమైన ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డులో ఇక నుంచి అన్ని రకాల అంశాలు కూడుకుని ఉండేలా విద్యాశాఖ హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డు (హెచ్‌పీసీ)ని రూపొందించింది.

kumaram bheem asifabad-విద్యార్థులకు హెచ్‌పీసీ కార్డులు
లోగో

కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థులు సాధించిన సబ్జెక్టుల వారీగా మార్కులు, హాజరు శాతం తెలిపేవిధంగా విద్యాశాఖ ప్రోగ్రెస్‌ కార్డులిచ్చేది. ఈ మేరకు విద్యా సంస్థల్లో అందిస్తున్న ప్రోగ్రెస్‌ కార్డు విధానం మారనుంది. కేవలం మార్కులకే పరిమితమైన ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డులో ఇక నుంచి అన్ని రకాల అంశాలు కూడుకుని ఉండేలా విద్యాశాఖ హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డు (హెచ్‌పీసీ)ని రూపొందించింది. జాతీయ విద్యా విధానం ఎన్‌ఈసీ-(2020)లో ప్రతిపాధించిన విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థుల మూల్యాంకన విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు పరాక్‌ (ఫర్‌ఫార్మెన్స్‌ అస్సెస్‌మెంట్‌ రివ్యూ) అండ్‌ అనాలసిస్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న సమ్మెటివ్‌ విద్యార్థుల బట్టీ విధానానికి స్వస్తి పలకనున్నారు. విద్యార్థుల్లో విశ్లేషణ, విమర్శనాత్మక ఆలోచనలకు భావనాత్మక స్పష్టత వంటి ఉన్నత స్థాయి విద్యా నైపుణ్యాలను పరీక్షించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో నమోదు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా యూఆర్‌ఎస్‌-1, మోడల్‌ స్కూల్స్‌-2, కేజిబీవి-15, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్‌-528, అప్పర్‌ ప్రైమరీ-100, లోకల్‌ బాడి ప్రభుత్వ పాఠశాలలు-60 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 40,436 మంది విద్యార్థులు ఈ కార్డు లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు అన్ని ప్రైవేటు పాఠశాలల్లోను ఈ విధానం అమలు కానుంది. ఈ విషయంలో డీఈవో ఆధ్వర్యంలో చర్చించినట్లు, త్వరలోనే ప్రతీ ఒక్క విద్యార్థికి హెచ్‌పీసి కార్డులు అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

- పూర్తి వివరాల నమోదు

పాఠశాలల్లో కొత్తగా ఇచ్చే హెపీసీ కార్డు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసేదిగా ఉంటుందని వ్యక్తిగత వివరాలు, శారీరక, మానసిక సామర్ధ్యాలు, అవగాహణ, సున్నితత్వం, పాఠశాలల్లో నిర్వహించే కృత్యాల్లో ప్రతిభ, ప్రశ్నలపై సమయస్పూర్తి, తదితర వివరాలు నిక్షిప్తం చేయనున్నారు. ఈ విధానం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలతో పాటు మోడల్‌, గురుకుల, నవోదయ, తదితర అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. హోలిస్టిక్‌ ప్రోగ్రెస్‌ కార్డు త్వరలోనే అన్ని పాఠశాలలో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా విద్యా శాఖ ఎస్‌వో శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - Dec 07 , 2025 | 11:05 PM