Share News

జ్వాలను అడ్డుకునేదెలా?

ABN , Publish Date - May 21 , 2025 | 12:37 AM

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నా ఆచరణలో కనిపించడంలేదు.

జ్వాలను అడ్డుకునేదెలా?

అగ్ని ప్రమాదం జరిగితే అడ్డు కట్టపడేనా

పలు భవనాలు, మాల్స్‌లో కన్పించని ఫైర్‌ సేఫ్టీ

ఇష్టానుసారం భవనాలు నిర్మాణం

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నా ఆచరణలో కనిపించడంలేదు. హైదరాబాద్‌లో ఇటీవల గుల్జార్‌హౌస్‌ చౌరస్తాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17మంది మృత్యువాత పడ్డారు. ఏ మాత్రం అగ్గిరాజుకున్న ప్రమాదంలో పెద్దగా మారుతుంది. మృత్యుజ్వాలగా మారకముందే అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు.

- ఆంధ్రజ్యోతి సూర్యాపేటటౌన్‌

సూర్యాపేట జిల్లాకేంద్రంలో భవనాల నిర్మాణా లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు అక్రమంగా నిర్మాణాలు జరగడంతో పాటు కనీసం ఫైర్‌సెఫ్టీ ప్రమాణాలు సైతం పాటించడం లేదు. భవనా ల్లో ఏ మాత్రం అగ్ని వ్యాపించినా వాటిని ఆర్పేసే యంత్రాలు సైతం భవనాల్లో ఉండడంలేదు. దీనికి తోడు అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలిం చడకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలో ఇటీవల అనుమతులకు మించి భవనాన్ని నిర్మించారు. భవ నం నిర్మాణం దాదాపుగా పూర్తయిన తర్వాత అదికారులకు తెలియగా కేవలం భవన యజమానికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ భవనానికి రోడ్డు కొద్దిగా ఉండడంతో ఏ మాత్రం ప్రమాదం జరిగినా భారీ నష్టం వాటిల్లే అవకాశముంది. అదేవిధంగా కుడకుడ ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రెనిడెన్షియల్‌ భవనాలకు 18మీటర్ల కన్నా ఎక్కువ నిర్మిస్తే ఫైర్‌సేఫ్టీ అనుమతులు తీసుకోవాలి. కమర్షియల్‌ భవనాలకు 15మీటర్ల కన్నా ఎక్కువ నిర్మాణాలకు ఫైర్‌సేఫ్టీ అనుమతులు తీసుకోవాలి ప్రస్తుతం అది ఎక్కడా జరగడం లేదు. జిల్లాకేంద్రంలో అక్రమంగా ఐదు నెలల్లో సుమారు 30 వరకు నిర్మాణాలు చేపట్టారు. వీటిలో కొన్నింటికి మాత్రమే నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోణలు ఉన్నాయి. .

అగ్ని రాజుకుంటే బుగ్గే

జిల్లాకేంద్రంలో అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లు మాత్రమే కాకుండా అనేక కార్యాలయా లు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులను ఇరుకు భవనాల్లో అరకొర వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి సుమారు 22కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. ఈ రహదారిపై వెంట సుమారు 180 నుంచి 210 దాబాలు, హోటళ్లు ఉంటాయి. వీటిలో ఫైర్‌సేఫ్టీ ఉన్న హోటళ్లు కేవలం 10 లోపే ఉన్నాయి. జిల్లాకేంద్రంలో పెద్దపెద్ద మాల్స్‌ సుమారుగా 15 వరకు ఉంటాయి. వీటిలో ఫైర్‌సేఫ్టీ మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఫంక్షన్‌హాల్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫైర్‌సేఫ్టీ కనిపించడం లేదు. చాలామంది ఫైర్‌సేఫ్టీకి సంబందించిన లైసెన్సులు సైతం తీసుకోవడంలేదు. గత నెల ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఏసీ వైర్‌ల షాట్‌ సర్కూట్‌తో బ్యాంకులో మంటలు వచ్చాయి. అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గ పరిధిలో గడ్డివాములు, గుడిసెలు ఇలా ఇతర కారణాలతో ఐదు నెలల్లో 50కి పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో రూ.కోటి 30లక్షల ఆస్తినష్టం జరగకుండా కాపాడారు.

అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా ఏసీలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్‌ చేయించాలి. లూజ్‌ కనెక్షన్‌లు లేకుండా విద్యుత్‌ తీగలను మార్చాలి. వంట చేసిన తర్వాత విధిగా గ్యాస్‌ సిలిండర్‌ ఆఫ్‌ చేయాలి. భవననిర్మాణ యాజమానులు తప్పకుండా ఫైర్‌స్టేఫ్టీ అనుమతులు తీసుకోవాలి.

- జానయ్య, ఎస్‌ఎ్‌ఫవో సూర్యాపేట.

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు

పట్టణంలో అక్రమ నిర్మాణా లు చేపడితే కఠిన చర్యలు తీ సుకుంటాం. ఇప్పటికే అనుమతులు లేకుండ నిర్మించిన భవనాలకు నోటీసులు అందిం చాం. ప్రతి ఒక్క గృహ యజమాను లు తప్పకుండ ఫైర్‌సేప్టీ నిబంధనలు పాటించాలి.

- బి. శ్రీనివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌.

Updated Date - May 21 , 2025 | 12:37 AM