kumaram bheem asifabad- వాగులు దాటేదెలా..?
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:17 PM
భారీ వర్షాలు కురిస్తే చాలు ఆ గ్రామాల ప్రజలు ఆరిగోస పడాల్సిందే. కెరమెరి మండలంలో దశాబ్దం క్రితం మొదలు పెట్టిన వంతెన నిర్మాణ పనులు పూర్తి కాక పోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు పొంగితే సాహసం చేయక తప్పడం లేదు. మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్ వాగులపై వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- నేటికీ పూర్తి కాని పలు వంతెనల నిర్మాణాలు
- ఏళ్లు గడుస్తున్నా తీరని వెతలు
కెరమెరి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు కురిస్తే చాలు ఆ గ్రామాల ప్రజలు ఆరిగోస పడాల్సిందే. కెరమెరి మండలంలో దశాబ్దం క్రితం మొదలు పెట్టిన వంతెన నిర్మాణ పనులు పూర్తి కాక పోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు పొంగితే సాహసం చేయక తప్పడం లేదు. మండలంలోని అనార్‌పల్లి, లక్మాపూర్ వాగులపై వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లక్మాపూర్ వాగు ఉప్పొంగి ప్రవమించింది. లక్మాపూర్ గ్రామానికి చెందిన కవిత, పవన్ దంపతుల ఏడాదిన్నర వయస్సు గల కుమారుడు ఉండగా అతడికి జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం మం డల కేంద్రానికి వెళ్లాలంలే వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చేసేది లేక ప్రమాదం అ ని తెలిసిప్పటికీ తన కుమారుడిని చేతిలో పైకి ఎత్తి పట్టుకుని నిండుగా ప్రవహిస్తున్న వాగుదాటుతూ మండల కేంద్రానికి చేరుకుని చికితస అందించారు. అలాగే మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయ పడగా అతనిడికి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించే క్రమంలో గ్రామంలోని యువకులు అతడిని మంచంపై పడుకోబెట్టి వాగు దాటించారు.
- వాగు అవతలి వైపు ఉన్న
లక్మాపూర్, అనార్‌పల్లి గ్రామాల సమీపంలో వాగు అవతలి వైపు ఉన్న కరంజీవాడ, పెద్ద కరంజీవాడ, జన్కాపూర్, బోరిలాల్‌గూడ, అంద్‌గూడ, శంకర్‌లొద్ది తదితర గ్రామాల ప్రజలు ప్రతి నిత్యం వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రాక పోకలు సాగిస్తారు. అలాగే ఆదివారం జరిగే వార సంతకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తారు. వీరందరికి వర్షాకాలం ఓ ఆపద కాలం ఉన్నటుండి వర్షాలు కురిస్తే పస్తులుండాల్సిందే. ఒక వేళ తినడానికి కావాల్సిన గ్రాసం ముందే నిలువ ఉంచుకున్నా ఏదైనా అత్యవసరమైతే ప్రాణాలను పనంగా పెట్టి వాగు దాటాల్సిందే. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తమ కష్టాలు మాత్రం తీరడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాంగ్వీ, కేలి(బి) గ్రామాల మధ్య..
మండలంలోని సాంగ్వీ, కేలి(బి) గ్రామాల మధ్య లోలెవల్ వంతెనలు ఉండడంతో వంతెన అవతలి వైపున ఉన్న కేలి(బి), కేలి(కె), పర్సువాడ, గౌరి, లెండిగూడ, బోలాపటార్‌తో పాటు ఇందిరానగర్, కైరి, ఆగర్‌వాడ, ఇందాపూర్ తదితర గ్రామాలతో పాటు మహారాష్ట్రలోని జీవితి గ్రామాల ప్రజలు గంటల తరబడి వరద ఉధృతి తగ్గే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.