ఆసుపత్రులు ఎంత భద్రం..?
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:13 PM
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదేని అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఆసుపత్రుల్లో రోగుల కోసం కనీ స రక్షణ చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది.
-కనీస సౌకర్యాలు లేనిచోట దవాఖానల ఏర్పాటు
-నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు
- కనీస భద్రతా చర్యలు శూన్యం
మంచిర్యాల, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదేని అనుకోని ప్రమాదం సంభవిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఆసుపత్రుల్లో రోగుల కోసం కనీ స రక్షణ చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. మహా రాష్ట్రలో గతంలో ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో 15 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. ఆ ఆసుపత్రిలో రోగులు బయటకు వెళ్లే మార్గం లేకనే ప్రాణ నష్టం జరిగిందని అక్కడి అధికా రులు వెల్లడించారు. మంచిర్యాలలోనూ అదే మాదిరి ఆ సుపత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తుండటం గమ నార్హం. జిల్లా కేంద్రంలో రోజు రోజుకూ నూతనంగా ఏర్పాటు చేసే ఆసుపత్రుల సంఖ్య క్రమేపీ పెరుగుతోం ది. రోగుల రక్షణార్థం కనీస భద్రత చర్యలు చేపట్టడం లో యాజమాన్యాలు నిర్లక్ష్య దోరణిని అవలంభిస్తున్నా యి. ఈ విషయమై సంబంధిత అధికారులు దృష్టిసా రించి, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కనీస సౌకర్యాలు కరువు...
జిల్లా కేంద్రంలో ఉన్న చిన్న పెద్ద ఆసుపత్రుల్లో ఎ క్కడ చూసినా ఒకటి రెండు మినహా మిగతా వాటి లో కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. కనీసం వాహన పార్కింగ్ స్థలం కూడా లేకపోవడం గమనా ర్హం. ఇరుకు రోడ్లు, సందుల్లోనూ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చి అక్కడ నిలిపి ఉంచే పరిస్థితి లేదంటే అతిశయో క్తికా దు. ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆసుప త్రుల యాజమాన్యాలు రోగులతోపాటు, వారి అటెం డెంట్లు వేచి ఉండేందుకు కూడా అవసరమైన ఏర్పా ట్లు చేయకపోవడం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు...
ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్న అనేక భవనాల ని ర్మాణం నిబంధనల మేరకు ఉండటం లేదు. కార్లు వెళ్లలేని గల్లీల్లో వెలిసిన ఆసుపత్రులు పదుల సంఖ్యలో ఉన్నాయి. అప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలనో, ఇ తరత్రా అవసరాల కోసం నిర్మించిన వాటినో ఎంపిక చేసుకొని ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రో గుల గదులు గాలి, వెలుతురుకు అవకాశం లేకుండా ఉంటున్నాయి. అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం సంభవించిన సమ యంలో ఫైర్ ఇంజిన్ భవనం చుట్టూ తిరిగి మంటల నార్పేందుకు ఏర్పాట్లు ఉండాలి. అలాగే బహుళ అంత స్థుల భవనాలకు రెండు వైపులా వ్యతిరేఖ దిశలో విశా మైన మెట్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు సంభవిం చినప్పుడు ఒకదారి మూసుకుపోతే మరోదారిన రోగులు బయటకు వచ్చే విధంగా మెట్లు ఏర్పాటు చేయాలి. భవనాల్లో సైతం ఒక వరండాలో ప్రమాదం జరిగితే మరో వరండా నుంచి బయటకు వెళ్లే ఏర్పాట్లు ఉండా లి. అలాగే ఇంకో వైపు ఇనుముతో వెడల్పైన రాంపులు ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం ఏ ఆ స్పత్రిలో చూసిన ఒకవైపు మెట్లే దర్శనమిస్తుండగా, రాంపులు సైతం ఉండటం లేదు.
భద్రతా చర్యలు ప్రశ్నార్థకమే...
అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం జీ +4 భవ నం ఎత్తు కనీసం 15 మీటర్లు ఉంటే తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నో ఆబ్జక్షన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంది. అయితే అనేక భవనాల నిర్మాణాలు నిబంధనల మేరకు చేప ట్టకపోవడంతో ఫైర్ డిపార్టుమెంటు నుంచి నో ఆబ్జక్షన్ పొందే అవకాశం కూడా లేదు. అగ్నిప్రమాదాలు సంభ వించిన సమయంలో కేవలం ఆసుపత్రులలోని పేషెం ట్లేగాక, ఆయా గదుల్లోని అత్యంత విలువైన పరికరాలు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలకు తీవ్ర నష్టం వా టిల్లే ప్రమాదం ఉంది. అనుకోని విధంగా మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పేందుకు కార్బన్ డయాక్సైడ్, హైడ్రేంట్ సిస్టమ్, డ్రై కెమికల్ పౌడర్‌తో కూడిన ఫైర్ ఎస్టింగిషర్లు అందుబాటులో ఉంచుకో వలసి ఉంది. పరికరాలను అందుబాటులో ఉంచుకో వడంతోపాటు సిబ్బందికి వాటిని ఉపయోగించడంలో అవగాన కల్పించాలి. చాలా వరకు సంభవించే అగ్నిప్ర మాదాలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమవుతోంది. ఏసీలు నిరంతరంగా ఒకే విధంగా నడిపితే వేడిపుట్టి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఒకే సమయంలో అన్ని ఏసీలు ఆన్ చేయకుండా మార్చి ఉపయోగించ డం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చును. అలాగే విద్యుత్ వైరింగ్ పట్ల కూడా అప్రమత్తత అవసరం. వినియోగించే విద్యుత్‌కు సరిపడా వైరింగ్ స్థాయి ఉం దో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే కనీస ఫైర్ ఫైటింగ్ పరికాలు ఏర్పాటు చేసుకోవాలి. అవి పనిచేస్తున్నాయో లేదో తరుచుగా పరిశీలించడం ద్వారా అగ్రిప్రమాధాల నివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే అగ్నిమాపకశాఖ అధికారులు కూడా ఆసుపత్రులను తరుచుగా పర్యవే క్షిస్తూ నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.