Share News

kumaram bheem asifabad- దారి ఇలా.. వెళ్లేది ఎలా..?

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:41 PM

కాగజ్‌నగర్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, రోగులను మరో కష్టం పీడిస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా గుంతలు, బురదమయంగా మారింది. దీంతో రోగులు, ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రి నిర్మించి నప్పటికీ ఆసుపత్రి ఎదుట ఉండే రోడ్లు, ప్లాట్‌ ఫాం నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు వర్షపు మడుగు అడ్డంకిగా మారాయి.

kumaram bheem asifabad- దారి ఇలా.. వెళ్లేది ఎలా..?
ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారిలో నిలిచిన వర్షపు నీరు

- ఇబ్బందులు పడుతున్న రోగులు, వైద్య సిబ్బంది

- పట్టించుకోని అధికారులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది, రోగులను మరో కష్టం పీడిస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అంతా గుంతలు, బురదమయంగా మారింది. దీంతో రోగులు, ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రి నిర్మించి నప్పటికీ ఆసుపత్రి ఎదుట ఉండే రోడ్లు, ప్లాట్‌ ఫాం నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. కాగజ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు వర్షపు మడుగు అడ్డంకిగా మారాయి. నిత్యం వందలాది ప్రజలు, రోగులు, సిబ్బంది వచ్చి పోయే ఏరియా ఆసుపత్రికి దారిలేపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సంవత్సరం వర్ష కాలం ఇంకా కొనసాగుతుండడం దీనికి తోడు భారీ వర్షాలు కురిసిన ప్పుడల్లా వరద నీరు చేరి బుదరమయంగా మారుతోంది. చిత్తడి చిత్తడిగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లాలంటే పాద చా రులు, ద్విచక్ర వాహన దారులు ఇబ్బందులు పడుతు న్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆసుపత్రి భవనానికి కనీసం వెళ్లేందుకు దారి సరిగ్గా లేకపోవడం తో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- నియోజకవర్గంలోనే..

ప్రస్తుతం సిర్పూర్‌ నియోజకవర్గంలోనే సిర్పూర్‌ సా మాజిక ఆసుపత్రి, కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. గతంలో పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయి నుంచి ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఆసుపత్రి ముందు వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు పడు తున్నారు. ఆసుపత్రి ఆవరణ విశాలంగా ఉండడంతో ఖాళీ స్థలంతో పాటు రోగులకు అనుకూలంగా ఉంది. అయినా కూడా కేవలం ఆసుప త్రి మినహా వర్షం వస్తే చుట్టూ బురదమయంగా మారుతోంది. అలాగే ఈ ఆసుపత్రి ఆవరణలోనే 108, 102, ఇతర అంబులెన్సు లు, వాహనాలు పెడుతుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రి ముందు కనీసం రోడ్డు సరిగ్గా లేకపోవడంతో పాటు రాత్రి పూట అందకారంగా ఉంటోంది. కనీసం లైట్లు సరిగ్గా లేకపోవడంతో రోగులు, పోస్టు మార్టం కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు పాదచా రులు, రోగులు బురదలో జారి పడి స్వల్ప గాయాలపాలయ్యారు. ఇప్పటికైనా అధికా రులు స్పందించి ఆసుపత్రి వెళ్లే దారిలో గుంతలు పూడ్చి బురదమయంగా మారకుండా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 10:41 PM