Share News

kumaram bheem asifabad- పంచాయతీలకు నిధులు ఎలా వస్తాయంటే..

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:45 PM

రెండేళ్ల అనంతరం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలుకాగా ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా రెండో విడత నామినేషన్ల పర్వం కూడా మంగళవారంతో ముగిసింది. ఇక పాలకవర్గాలు కొలువుదీరడమే తరువాయి. అయితే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఇందుకోసం గ్రామపంచాయతీలకు ప్రధానంగా సొంత వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నిధులు వస్తాయి.

kumaram bheem asifabad- పంచాయతీలకు నిధులు ఎలా వస్తాయంటే..
లోగో

- సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు

- ఆ నిధులతోనే మౌలిక వసతుల కల్పన

బెజ్జూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల అనంతరం స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడం, గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలుకాగా ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా రెండో విడత నామినేషన్ల పర్వం కూడా మంగళవారంతో ముగిసింది. ఇక పాలకవర్గాలు కొలువుదీరడమే తరువాయి. అయితే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు అవసరం. ఇందుకోసం గ్రామపంచాయతీలకు ప్రధానంగా సొంత వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల నిధులు వస్తాయి. అయితే పంచాయయతీలకు ఎలాంటి నిధులు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి, దాంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో తెలుసుకుందాం

- పన్నుల ద్వారా..

పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం సమకూరుతుంది. గృహపన్ను, నీటి పన్న, వృత్తి(వ్యాపారాలు, వృృత్తులపై) పన్ను, వారాంతపు సంతలు, మార్కెట్ల నిర్వహణ ద్వారా, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా పంచాయతీకి సొంత వనరులు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ర్టేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వ సాధారణ గ్రాంట్లు విడుదలవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి..

ఐదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. పారిశుధ్యం, మౌళిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్చ భారత్‌ మిషన్‌ ద్వారా గ్రామ పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన వంటి పథకాలతో ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది.

ఖర్చులు ఇలా..

గ్రామపంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహ ణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైయినేజీ, వీధిదీపాలు, పచ్చదనం నిర్వహణకు, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ -గ్రామ స్వరాజ్‌ పోర్టల్‌ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్‌, ఖర్చుల వివరాలు, ఆడిట్‌ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది.

Updated Date - Dec 02 , 2025 | 10:45 PM