Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:03 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయా లని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం క లెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావే శం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల కు మంజూరైనా ఇంకా ఇళ్ల పనులను ప్రారంభించని లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూ డాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయా లని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. శనివారం క లెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమావే శం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లబ్ధిదారుల కు మంజూరైనా ఇంకా ఇళ్ల పనులను ప్రారంభించని లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చూ డాలన్నారు. బేస్‌మెంట్‌, లెంటల్‌, స్లాబ్‌ల వారీగా జరి గిన పనులను ఫోటోలు తీసి పోర్టల్‌లో నమోదు చే యాలన్నారు. అలాగే మున్సిపాలిటీల పరిధిలో వంద శాతం ఆస్తి పన్నులను వసూలు చేయాలని సూచించా రు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు.

హెచ్‌ఐవీ నియంత్రణలో ప్రతీ ఒక్కరు భాగస్వా మ్యం కావాలి

హెచ్‌ఐవీ నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వా మ్యం కావాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివా రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, హెచ్‌ఐవీ నియంత్రణ యూనిట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించాల ని, వ్యాధి గ్రస్తుల పట్ల ఉన్న వివక్షను రూపుమాపేం దుకు అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం చేపడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో అనిత, పోగ్రాం అధికారి సుధాకర్‌ నాయక్‌, డీఎంవో వెంక టేశ్వర్లు, సీహెచ్‌వో నాందేవ్‌, ఐసీటీసీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:03 PM