ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన హౌసింగ్ డీఈ
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:34 PM
మోడల్ గ్రామం జిన్‌కుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ దశను పరిశీ లించినట్లు హౌసింగ్ ప్రాజెక్టు అధికారి సంగప్ప తెలిపారు.

బల్మూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి) : మోడల్ గ్రామం జిన్‌కుంటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ దశను పరిశీ లించినట్లు హౌసింగ్ ప్రాజెక్టు అధికారి సంగప్ప తెలిపారు. గ్రామంలో 73 మంది ఇళ్లు లేని వారు ఉన్నట్లు గతం లో గుర్తించామని, ప్రస్తుతం 42 ఇళ్లకు మార్క్ ఇచ్చామని తెలిపారు. అందు లో 20 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయ ని ఆయన తెలిపారు. మోడల్ విలేజ్ గా ఈ గ్రామాన్ని ఈ మండలంలో మొ దటి గ్రామంగా తీసుకున్న సందర్భంగా చాలా మంది నిరుపేదలు త్వరగా ఇల్లు నిర్మిం చడానికి ఉత్సాహంగా ఉన్నారని ఆయన తెలి పారు. త్వరలో వీరికి బిల్లులు వచ్చే విధంగా చూ స్తామని అన్నారు. పీడీవెంట డీఈ ఆనం ద్‌రెడ్డి, ఎంపీడీవో రాఘవులు, పంచాయతీ కార్యదర్శితోపాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.