ఇళ్లను పటిష్టంగా నిర్మించుకోవాలి : ఎమ్మెల్యే
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:22 PM
నివాసం లేని పేదల కోసం ఇళ్లు ఇ వ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నా రని, లబ్ధిదారులు తమ ఇ ళ్లను పటిష్టంగా నిర్మిం చుకోవాలని స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు.
ఇళ్లను పటిష్టంగా నిర్మించుకోవాలి : ఎమ్మెల్యే
బల్మూరు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : నివాసం లేని పేదల కోసం ఇళ్లు ఇ వ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నా రని, లబ్ధిదారులు తమ ఇ ళ్లను పటిష్టంగా నిర్మిం చుకోవాలని స్థానిక ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు. మంగళవారం స్థానిక ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. మండల పరిధిలోని వివిధ గ్రా మాల నుంచి వచ్చిన 207మంది లబ్ధిదారులకు అందించారు. నియోజకవర్గంలో 45,120 బోర్ వెల్స్‌తో రైతులు నిరంతరం విద్యుత్‌తో సేద్యం చేస్తున్నారని, గిరి వికాసం పథకం వర్తింపజేయ నున్నట్లు తెలిపారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజేందర్, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, గిరివర్ధన్‌గౌడ్, రాంప్రసా ద్ గౌడ్, ఖదీర్, సుధాకర్‌గౌడ్, కాశన్నయాదవ్, మశన్న, జిల్లా హౌసింగ్ పీడీ సంగప్ప, ఎంపీడీ వో జెట్టి రాఘవులు, తహసీల్దార్ శ్రీకాంత్, హౌసింగ్ హర్యానాయక్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.