హాస్టల్ వర్కర్ల పెండింగ్ జీతాలు చెల్లించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 10:44 PM
జిల్లాలోని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెం టనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీని వాస్ డిమాండ్ చేశారు.
- కలెక్టరేట్ ఎదుట ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్
నాగర్‌కర్నూల్ టౌన్, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెం టనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీని వాస్ డిమాండ్ చేశారు. బుధవా రం సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్ట ల్ వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధ ర్నా నిర్వహించారు. ఆర్.శ్రీనివాస్ మాట్లాడు తూ జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో పని చే స్తున్న అవుట్ సోర్సింగ్ వర్కర్లకు చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నారని, వాటిని కూడా స కాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. జిల్లా ఉన్నతాధికా రులు తక్షణమే స్పందించి జిల్లాలోని హాస్టల్స్ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లిం చండంతో పాటు కనీస వేతనాలు రూ.26 లక్ష లకు పెంచి ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాల ని ఆయన కోరారు. కార్యక్రమంలో హాస్టల్ వర్క ర్లు యాదగిరి, నాగార్జున, హరిబాబు, రామ స్వామి, కిరణ్, బాలకృష్ణ, జానకిరాములు, అరు ణ, నిరంజనమ్మ, పురుషోత్తం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.