Share News

ఆసుపత్రి పనులు వేగంగా పూర్తిచేయాలి

ABN , Publish Date - May 10 , 2025 | 11:20 PM

పట్టణంలో నూ తనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుప త్రితో పాటు కళాశాల భవన నిర్మాణం పనులు వే గంగా పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే నాయకులతో కలిసి భవనాల నిర్మాణం పనులు పరి శీలించారు.

ఆసుపత్రి పనులు వేగంగా పూర్తిచేయాలి
లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, మే 10(ఆంధ్రజ్యోతి): పట్టణంలో నూ తనంగా నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఆసుప త్రితో పాటు కళాశాల భవన నిర్మాణం పనులు వే గంగా పూర్తి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కి రాల ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం ఎమ్మెల్యే నాయకులతో కలిసి భవనాల నిర్మాణం పనులు పరి శీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ తాను చిన్నతనంలో విధ్యను అభ్యసించిన కళాశాల, పాఠశాల భవనాల పునర్నిర్మాణాలు తన హయాలో చేపట్టడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. రా నున్న కొన్ని తరాల పిల్లలకు సకల సౌకర్యాలు ఉండే లా భవనం నిర్మిస్తామని అంతే కాకుండా కళాశా లలో అన్ని వసతులు, పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉండేందుకు కూడా తాను కృషి చేస్తానన్నారు. కార్పొ రేటుకు ధీటుగా మన నియోజివర్గంలో విద్య, వైద్యం ప్రజలకు అందించడమే లక్ష్యం అన్నారు. అందుకే ఏ డాది పూర్తి కాకుండానే కళాశాల భవనం నిర్మించా మని అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి భవనం కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉండగా కొన్ని మార్పులు, చేర్పులతో ఆలస్యం అయ్యిందని వచ్చే నెలలో ప్రభుత్వ ఆసుపత్రి భవనంతో పాటు కళాశాల భవనం కూడా ప్రారంభించి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు. ఈకార్య క్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రభుత్వ ఆసుపత్రి సూప రిండెంట్‌ ఆకుల శ్రీనివాస్‌, వైద్యులు సురేష్‌, పవిత్ర, స్రవంతితో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్‌, మండల అద్యక్షుడు పింగిళి రమేష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చెల్ల నాగభూషణం, నాయకులు చింత అశోక్‌, పూర్ణచందర్‌రావు, గడ్డం త్రిమూర్తి పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:20 PM