Share News

ఆస్పత్రి నిర్మాణ పనుల వేగం పెంచాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 11:58 PM

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల వేగం పెంచాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆయన శనివారం సాయంత్రం పరిశీలించారు.

ఆస్పత్రి నిర్మాణ పనుల వేగం పెంచాలి
ప్రభుత్వ ఆసుపత్రి నిర్మానం పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

లక్షెట్టిపేట, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల వేగం పెంచాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆయన శనివారం సాయంత్రం పరిశీలించారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని పనుల్లో జాప్యం వహిస్తే స హించేది లేదన్నారు. వచ్చె నెలలో ప్రారంభానికి మొత్తం సిద్ధం చేయాలని ఆదేశించారు. అనం తరం ఇటీవల నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రారంభించిన ప్రభుత్వ పాఠశాల భవనాలను పరిశీలిం చిన ఎమ్మెల్యే విధార్థులకు నాణ్యమైన విధ్యను అందించాలని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు ధీటుగా విద్యను అందిస్తున్నట్లు పేరు సంపాదించే విధంగా చూడాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ దిలీ ప్‌కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి,ఆరీఫ్‌, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్‌, ఆర్టీఏ మెంబర్‌ అంకతి శ్రీనివాస్‌, నాయకులు పూర్ణచందర్‌రావు, గుత్తికొండ శ్రీధర్‌, తోట రమేష్‌, గోప రమేష్‌తో పా టు పాఠశాల, కళాశాల సిబ్బంది, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 11:58 PM