Share News

పుంజుకున్న ఆసుపత్రి నిర్మాణ పనులు...

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:17 PM

జిల్లా కేం ద్రంలో ప్రభుత్వపరంగా నిర్మించతలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప నులు వేగం పుంజుకున్నాయి. జీ+6 అంతస్థులతో ని ర్మించనున్న ఆసుపత్రికి రూ. 324 కోట్లు ఖర్చవుతా యని అంచనా. ఆసుపత్రి నిర్మాణ పనులకు గత ఏ డా ది నవంబరు 21న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకు స్థాపన చేయగా, ప్రస్తుతం జీ+2 అంతస్థుల నిర్మాణం కొనసా గుతోంది.

పుంజుకున్న ఆసుపత్రి నిర్మాణ పనులు...

-జిల్లా కేంద్రంలో జీ+6తో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

-ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు

-దాంతో పాటే మాతా, శిశు ఆరోగ్యం కేంద్రానికి కూడా

-రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో భవన నిర్మాణం

మంచిర్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలో ప్రభుత్వపరంగా నిర్మించతలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప నులు వేగం పుంజుకున్నాయి. జీ+6 అంతస్థులతో ని ర్మించనున్న ఆసుపత్రికి రూ. 324 కోట్లు ఖర్చవుతా యని అంచనా. ఆసుపత్రి నిర్మాణ పనులకు గత ఏ డా ది నవంబరు 21న రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షే మ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకు స్థాపన చేయగా, ప్రస్తుతం జీ+2 అంతస్థుల నిర్మాణం కొనసా గుతోంది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలోని రోడ్లు, భవనాల శాఖకు చెందిన పాత ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మా ణానికి అధికారులు స్థలం ఎంపిక చేయగా, స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు రెవెన్యూ అధికారులు అప్పగించా రు. ఆ స్థలంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కె ట్‌ భవనం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, ప్రభుత్వ అతిథి గృహం, ఆర్డీవో కార్యాలయాలను కూల్చివేశారు. ఆర్డీవో కార్యాలయంతోపాటు ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయాన్ని స్థా నిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోగల గతంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు కేటాయించిన రెండతస్థుల భవనం లోకి తరలించారు. ఆసుపత్రి నిర్మాణం కోసం తెలం గాణ హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌ మెంట్‌ తొలి విడుతగా రూ. 50 కోట్లకు పరిపాలన అ నుమతులు జారీ చేస్తూ సెప్టెంబరు 12న జీవో 546ను విడుదల చేయగా ఏడాది క్రితమే పనులు ప్రారంభమయ్యాయి.

పొరుగు రాష్ర్టాల ప్రజలకు వైద్య సేవలు...

జిల్లా కేంధ్రంలో అన్ని హంగులతో ప్రభుత్వపరంగా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేసి తీరుతా మన్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు హామీలో భాగంగా ప్ర భుత్వం పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో ఏడు అంతస్థులతో ఆసుపత్రి భవ న నిర్మాణం చేపట్టనుండగా కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు ప్రజలకు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ మే రకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ నిధులు కే టాయించారు. దీంతో ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమంకాగా గరిష్టంగా మూడేళ్ల కాలంలో భవన ని ర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం ఉం ది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం పూ ర్తయితే మంచిర్యాల, కొమరంభీం జిల్లాలతోపాటు పొర గు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందే అవకాశాలు అనే కం ఉన్నాయి. ఆసుపత్రిని మొత్తం 650 పడకల సా మర్థ్యంతో నిర్మిస్తుండగా, 425 పడకలతో సూపర్‌ స్పె షాలిటీ ఆసుపత్రి, 225 పడకలతో మాతా, శిశు ఆరోగ్య కేంద్ర భవనాలను నిర్మించనున్నారు.

ఎంసీహెచ్‌ కూడా అక్కడే....

ప్రస్తుతం గోదావరి సమీపంలో ఉన్న మాతా, శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)ను కూడా సూపర్‌ స్పెషా లిటీ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చనున్నారు. ఈ మేరకు ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక భవన నిర్మా ణాన్ని చేపట్టారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంసీ హెచ్‌ రెండు ఒకే ప్రాంగణంలో నిర్మించడం కూడా రోగులకు వైద్యసేవల పరంగా అందుబాటులో ఉండను న్నాయి. ఎంసీహెచ్‌ గోదావరి సమీపంలో ఉండటంతో వర్షాకాలంలో ప్రతియేటా వరద ముంపునకు గురవు తోంది. దీంతో అక్కడ చికిత్స పొందే గర్భిణులు, బాలిం తలతోపాటు చిన్నారులను హుటాహుటిన ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. ఈ క్రమం లో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవస్థలు దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌ రా వు ఎంసీహెచ్‌ను ఐబీ చౌరస్తా సమీపంలోకి మార్చా లనే పట్టుదలతో మొదటి నుంచీ ఉన్నారు. ఆయన ఆ కాంక్ష మేరకు ఐబీ చౌరస్తా సమీపంలో సూపర్‌ స్పె షాలిటీ ఆసుపత్రి నిర్మాణం పురుడు పోసుకుంది.

ఆసుపత్రులకు అనువైన స్థలం...

ఐబీ సమీపంలో ఆసుపత్రుల నిర్మాణం కోసం కేటా యించిన స్థలం అన్ని విధాలా అనువైనదనే అభిప్రా యాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన స్థ లానికి ఎదురుగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఉండ టం, వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉం టుందని అప్పటి అధికారులు సైతం అభిప్రాయ ప డ్డారు. పైగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ఉండ టంతో బస్సుల్లో ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండనుంది. బస్సు దిగిన వెంటనే ఆసుపత్రిలో అడుగు పెట్టే వెసులుబాటు కలుగనుంది.

Updated Date - Nov 12 , 2025 | 11:17 PM