ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ఆశలు...
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:29 PM
తుమ్మి డిహెట్టి బ్యారేజీ ద్వారా తక్కువ ఖర్చుతో గోదావరి జ లాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆ ప్రాజె క్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది.
-తుమ్మిడిహెట్టిని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు
-వ్యాప్కోస్ నివేదిక పునఃపరిశీలన ఆధారంగా డీపీఆర్
-సుందిళ్లకు గ్రావిటీతో నీటికి కొత్త ప్లాన్..?
-150 మీటర్ల ఎత్తు కోసం మహారాష్ట్రతో సంప్రదింపులు
మంచిర్యాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తుమ్మి డిహెట్టి బ్యారేజీ ద్వారా తక్కువ ఖర్చుతో గోదావరి జ లాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచీ వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఆ ప్రాజె క్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మే నిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. తుమ్మి డి హెట్టి ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఉమ్మడి జిల్లాను సశ్యశ్యామలం చేయనున్నట్లు గతేడాది పెద్దపల్లిలో జరి గిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ప్రకటించారు. దీంతో తుమ్మిడి హె ట్టిపై ఆశలు చిగురిస్తుండగా, ప్రాజెక్టు విషయంలో కేం ద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ గతంలో చేసిన సర్వే ఫ లితాలను పునః పరిశీలన చేయించే పనిలో రాష్ట్ర ప్ర భుత్వం పడింది. ఆ ఫలితాల ఆధారంగా డీపీఆర్‌కు తుదిరూపు ఇచ్చి, అనుమతుల కోసం కేంద్ర జలవన రుల సంఘం(సీడబ్ల్యూసీ)లో దాఖలు చేయాలనే ఆలో చనతో ఉంది. గతంలో తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంప ల్లికి నీటిని తరలించాలని ప్రతిపాదించగా... తాజాగా గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీకి నీటిని తరలించాలనే కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరమీదకి తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి 71.5 కిలోమీటర్ల వరకు కాలువల నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. ఇక బ్యారేజీ నిర్మాణమే తరు వాయి అనే పరిస్థితిలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు బ్యారేజీ నిర్మాణం జరిగితే తు మ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలారం గ్రా మం వరకు 71.5 కిలీమీటర్ల దూరం మోటార్ల విని యోగం లేకుండానే నీరు గ్రావిటీతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి తక్కువ సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించవచ్చని గతంలో ప్రతిపాదించారు.
150 మీటర్ల ఎత్తుతో నిర్మాణం....!
ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో కట్టాలని ప్రతిపాదించగా....ముంపు అ ధికంగా ఉంటుందనే మహారాష్ట్ర అభ్యంతరాలతో పక్క న పెట్టారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 148 టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టును కడతామని మహారాష్ట్ర అప్పటి సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో నాటి తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు. దీనికి మహా రాష్ట్ర అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసింది. కాళే శ్వరంతో పాటే తుమ్మిడిహెట్టిని కడతామని కేసీఆర్ ప్ర కటించారు. తర్వాత తుమ్మిడిహెట్టి కాలగర్భంలో కలి సిపోయింది. వన్యప్రాణుల అభయారణ్యం, సాంకేతిక అంశాలు, నీటి లభ్యత లేదనే కారణాలతో ప్రాజెక్టును పక్కనబెట్టారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్వేలో తే ల్చారు. గోదావరి, కృష్ణ, తదితర అన్ని నదుల్లో సహ జంగా జూన్ నుంచి నవంబరు వరకే వరద ఉంటుం ది. ప్రాణహితలో మాత్రం ఫిబ్రవరిలో కూడా 10 వేల క్యూసెక్కుల దాకా ప్రవాహం ఉంటుంది. దీంతో తుమ్మి డిహెట్టి వైపే కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తాజాగా 150 మీటర్ల ఎత్తు కోసం మహారాష్ట్ర ప్రభు త్వంతో చర్చలు జరపాలనే నిర్ణయానికి వచ్చింది. దీని కోసం త్వరలో మహారాష్ట్రకు వెళ్లనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల తెలిపారు. అయితే 150 మీటర్ల ఎత్తు కట్టేందుకు మహారాష్ట్ర ప్ర భుత్వం సమ్మతి తెలపాల్సి ఉంది. ప్రాణహిత నది అవ తల గ్రామాల ముంపు, అటవీ అనుమతులు బ్యారేజీ నిర్మాణానికి సవాళ్లుగా మారనున్నాయి. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రాజెక్టు విషయంలో పట్టుదలతో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని రైతులకు సాగునీరందే అవకాశాలు అనేకం ఉన్నాయి.
సుందిళ్లను వినియోగించడం ద్వారా...
తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీతో సుందిళ్ల బ్యారేజీ లోకి నీటిని పంపించవచ్చని అధికారులు తాజాగా అభి ప్రాయానికి వచ్చారు. నెన్నెల మండలంలోని మైలారం వద్ద పంప్ హౌస్ కట్టి ఎల్లంపల్లిలో నీటిని ఎత్తిపో యాలా..? లేక సుందిళ్లకు గ్రావిటీతో తరలించి, దాని పైననే ఉన్న ఎల్లంపల్లికి ఎత్తిపోయాలా..? అన్న దాని పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మైలారం గ్రామం వద్ద తవ్విన కాల్వలు, పైప్‌లైన్ల ద్వారా నీటిని సహజ సిద్ధంగా ప్రవహించే జైపూర్‌లోని రసూల్‌పల్లె వాగులో కలపడం ద్వారా అక్కడి నుంచి గోదావరిలోకి గ్రావిటీ ద్వారా తరలించే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తు న్నారు. గోదావరి నీటిని సుందిళ్ల బ్యారేజీకి తరలించి, అక్కడి నుంచి నేరుగా ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజె క్టులోకి తక్కువ ఖర్చుతో పంపింగ్ చేసే యోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధా నంలో కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయంలోని మిగతా బ్యారేజీలతో పనిలేకుండానే ఎగువకు నీరు తరలించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. తుమ్మిడి హెట్టిని కట్టడం ద్వారా 16 లక్షల ఎకరాలకు నీరు అం దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.