సాదాబైనామాలపైనే ఆశలు
ABN , Publish Date - Jul 08 , 2025 | 11:44 PM
బీఆర్‌ఎస్ ప్ర భుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘ధరణి’ భూ స మస్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కు ముడులను తెచ్చిపెట్టింది. ఆర్జీల పరిష్కారం కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగిన స్పందనలేకుండా పో యింది.
2016 నుంచి క్రమబద్ధీకరణకు నోచుకోని వైనం
అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి రైతు ల ఎదురుచూపు
రెవెన్యూ సదస్సులో పెద్ద మొత్తంలో దరఖాస్తులు
ధరణిలో పరిష్కారంకాని భూ సమస్యలు
మంచిర్యాల, జూలై8 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ప్ర భుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘ధరణి’ భూ స మస్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కు ముడులను తెచ్చిపెట్టింది. ఆర్జీల పరిష్కారం కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగిన స్పందనలేకుండా పో యింది. ఈ క్రమంలో కాంగ్రెస్ హయాంలో ’ధరణి’ స్థానంలో తెరపైకి వచ్చిన ’భూభారతి’ రైతుల్లో ఆశ లను రేకేత్తిస్తోంది. భూభారతి కింద రాష్ట్ర ప్రభు త్వం దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పెద్ద మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. స్వీకరిం చి న దరఖాస్తుల్లో అధిక భాగం సాదాబైనామా, అసై న్డ్ భూములకు సంబంధించివి కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సాదాబైనా మా పరిష్కారం కోసం 2,866 దరఖాస్తులు రావడం కొసమెరుపు. వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే సాదాబై నామాల చట్ట బద్దత, సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చె ప్పవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ’భూబారతి’లోనైన తమ సమస్య లకు పరిష్కారం లభిస్తుందేమోనని బాధిత రైతులు ఆ శతో ఉన్నారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో 2020 అక్టోబర్‌లో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అప్పుడు పరిష్కారం లభించలేదు. కనీసం ప్రస్తుత ప్రభుత్వ మై న పరిష్కారం చూపుతుందనే ఆశతో రైతులు ఉన్నారు.
భూభారతితో పరిష్కారం...!
ప్రభుత్వం ఆర్‌వోఆర్-2020-25 భూభారతి చట్టాన్ని తీసుకవచ్చింది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా బాధితులు దరఖాస్తులు చేసుకున్నా రు. గత ప్రభుత్వం రైతులకు భూ హక్కులు కల్పించే పట్టదారు పాసు పుస్తకాల చట్టం-1971ని రద్దు చేసి కొత్తగా పాసు పుస్తకాల చట్టం -2020 పేరిట ధరణిని తీసుకొచ్చిం ది. అయితే ఈ విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వ కపోగా కొత్త సమస్యలను తీసుకొచ్చింది. ఈ క్రమం లో కాంగ్రెస్ సర్కార్ గత ఏప్రిల్ 14న ధరణి స్థానం లో కొత్తగా భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇం దులో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి అన్ని మండ లాల్లో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి 20వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. ఆగ స్టు 15వ తేదీ వరకు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో భూ సమ స్యలకు భూభా రతిలో పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం రైతుల్లో కనిపిస్తోంది.
జీవోల జారీతోనే సరిపెట్టిన గత ప్రభుత్వం...
రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సా దా బైనామా కూడ ఒకటి. గతంలో గ్రామాల్లో చాలా మంది రైతులు రెవెన్యూ స్టాంప్ పేపర్లు తెల్లకాగితా లపై భూముల క్రయవిక్రయాలు జరిపేవారు. భూ ముల హక్కు సంపూర్ణంగా లభించేదికాదు. ఈ విష యమై దృష్టి సారించిన గత ప్రభుత్వం సాదాబైనా మాల సమస్యను పరిష్కరించేందుకు 2016లో జీవో నెంబర్ 153ను తీసుకొచ్చింది. జూన్ 2014 2వతేదీ కి ముందుగా సాదాబైనామాలతో భూములు కొను గోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. 2020 అక్టో బర్ 12న కూడ జీవో నెంబర్ 112ను జారీ చేసింది. సాదాబైనామాల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉ ప సంఘాన్ని కూడ వేసింది. అయినా స మస్యలకు పరిష్కారం లభించలేదు. ఆ స మస్య పరిష్కారం కాకుండానే 29అక్టోబర్ 2020లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల చ ట్టాన్ని తెచ్చింది. గత ప్రభుత్వం కేవలం జీ వోల జారీతోనే సరిపెట్టిందని, సాదా బైనా మాలపై తహసీల్దార్‌లకు అధికారాలు ఇచ్చి నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు సరైన మార్గదర్శకాలను విడుదల చేయలేదనే విమ ర్శలు ఉన్నాయి.
ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా రై తు సమస్యలను పరిష్కరించేందుకు దర ఖాస్తులు స్వీకరించింది. దర ఖాస్తుల్లో అధిక భాగం సాదాబైనామాలకు చెందినవే ఉన్నా యి. వీటితో పాటు అసైన్డ్ భూముల కోసం కూడ దరఖాస్తులు వచ్చాయి. అయితే కాం గ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేరకు సాదా బైనామాల సమస్యలను త్వరితగతిన పరి ష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సాదా బైనామాల అంశం హైకోర్టు లో ఉన్నందున ప్రభుత్వం కూడ ఎటు తే ల్చుకోలేని స్థితిలో ఉంది. వాస్తవానికి ప్రభు త్వం భూభారతి చట్టంలో సాదా బైనామాల సమస్యను చేర్చినందున హైకోర్టు తీర్పు కూ డ అనుకూలంగా వస్తుందనే అభిప్రా యా లు వ్యక్తమవుతున్నాయి. తీర్పు వెలువడిన తక్షణమే ప్రభుత్వం విధి విధానాలు రూ పొందించి సమస్యలకు పరిష్కారం చూపా లనే విజ్ఞప్తులు ఉన్నాయి.